Lockdown in India 2022: కరోనా కేసులు మరోసారి దేశంలో భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ మూడో వేవ్ ప్రారంభమైన తరుణంలో మరోసారి లాక్ డౌన్ ప్రస్తావన వచ్చింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్రం లాక్ డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 1,17,100 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 302 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి.
WHO warning over Omicron spread: ఒమిక్రాన్ తీవ్రత, దాని స్వభావంపై ఇంకా కచ్చితమైన డేటా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకూ నమోదైన కేసులను బట్టి డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. అంతమాత్రానా ఒమిక్రాన్ వేరియంట్‌ను లైట్ తీసుకోవద్దంటోంది డబ్ల్యూహెచ్ఓ.
Himachal Pradesh Night Curfew: కరోనా వైరస్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అములో ఉంటుందని తెలిపింది.
Telangana new Covid, Omicron cases : తెలంగాణలో కోవిడ్ విజృంభన.. 1,052 మందికి కోవిడ్ పాజిటివ్. 10 మందికి ఒమిక్రాన్ పాజిటివ్. తెలంగాణలో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,033. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 4,858.
Omicron Symptoms: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తుంది. అయితే ఈ వైరస్ బారిన పడిన వాళ్లు కరోనా లక్షణాలతో పాటు మరో రెండు కొత్త లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. ఆ లక్షణాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
Omicron scare: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు కలిగిస్తోంది. రాజస్థాన్‌లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Corona cases in India: దేశంలో కరోనా ఆందోళనలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొత్త కేసుల్లో నమోదవుతున్న వృద్ధి.. పరిస్థితులు మళ్లీ దిగజారుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.
AP Omicron cases: ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొత్తగా ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. కొత్త కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
3 fresh Omicron cases in Telangana : తెలంగాణలో తాజాగా మరో 3 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి.
Omicron Cases in AP: ఆంధ్రప్రదేశ్ లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. ఇటీవలే కువైట్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ మహిళకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అయితే ఆమె కుటుంబసభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
Omicron Cases in Tamilnadu: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కొత్తగా 45 పాజిటివ్ కేసులు నిర్ధారణ అవ్వడం వల్ల మొత్తం 295 కేసులు నమోదయ్యాయి.
Omicron cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి సంఖ్య మొత్తం 38 కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. ఇదిలావుంటే, మరోవైపు కొత్తగా 37,353 మందికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా.. అందులో 182 మందికి కరోనావైరస్ (Coronavirus cases) సోకినట్టు నిర్థారణ అయింది.
Omicron Case in Hyderabad: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
Breaking News, Second Omicron Case in AP: ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. ఇటీవలే కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. అయితే ఆమె కుటుంబసభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి స్వల్పంగా నమోదైంది. కొత్తగా 6,317 మంది వైరస్ బారిన పడగా.. కరోనా ధాటికి మరో 318 మంది మృతి చెందారు. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 215కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
Omicron third wave : తాజా అధ్యయనాల ప్రకారం మనదేశంలో కూడా త్వరలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య చాలా పెరుగుతుందని తేలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Omicron cases around the world: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.