Omicron third wave likely to arrive early next year, peak in february : ప్రపంచాన్ని మొత్తం ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. దాదాపు 90 దేశాలకు పైగా ఒమిక్రాన్ పాకింది. గతంలో వచ్చి డెల్టాప్లస్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు చాలా స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం మనదేశంలో కూడా త్వరలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య చాలా పెరుగుతుందని తేలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి థర్డ్ వేవ్ (Omicron third wave) వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశంలో ఇప్పటికే రెండొందలకు పైగా ఒమిక్రాన్ కేసులు (Omicron cases) నమోదయ్యాయి. డెల్టా ప్లస్ తో (Delta Plus) పోల్చుకుంటే ఒమిక్రాన్ డెబ్భై రెట్లు వేగంగా విస్తరిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ తాజా అధ్యయనం తెలిపింది.
ఒమిక్రాన్ రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా పతనం చేస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. అంతేకాదు మరికొన్ని రోజుల్లో కోవిడ్‌కు సంబంధించిన చాలా వేరియంట్లు పుట్టుకొస్తాయట.
Also Read : వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ సర్కార్ ఫెయిల్-కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఫైర్
ఇప్పటి వరకూ ఒమిక్రాన్ బారిన పడిన వారిలో గొంతులో నొప్పి, అలసట వంటి తేలికపాటి లక్షణాలు మాత్రమే బయటపడ్డాయి. జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటుంటే వారంతా కోలుకుంటున్నారు. మనదేశంలో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ డెత్ నమోదు కాలేదు. అయినప్పటికీ ఒమిక్రాన్ (Omicron) విషయంలో జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : Disney Plus Hotstar Subscription: నెట్ ఫ్లిక్స్ బాటలో డిస్నీ+హాట్ స్టార్.. రూ.49లకే సబ్స్క్రిప్షన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook