India’s Omicron tally mounts to 1,270 Most In Maharashtra 450 Cases : కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ రోజురోజుకు హడలెత్తిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ (Omicron) బారిన పడిన వారి సంఖ్య శుక్రవారానికి 1,000 పైగా చేరింది. ఇప్పటి వరకు 1,270 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1,270కి చేరింది. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ 450 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు (Omicron cases) వెలుగులోకి వచ్చాయి గానీ డెత్స్ లేవు అనుకునే తరుణంలో మొదటి మరణం కూడా సంభవించింది. దేశంలో ఒమిక్రాన్ మొదటి మరణం (Omicron first death) మహారాష్ట్రలో (Maharashtra) నమోదైంది.నైజీరియా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒమిక్రాన్‌తో మృత్యవాతపడ్డాడు. మహారాష్ట్రలో 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ బారినపడి గుండెపోటుతో (Heart attack) మరణించాడు. డిసెంబర్ 28న ఆయన మరణించాడు.
నైజీరియా నుంచి తిరిగి వచ్చిన ఆ వ్యక్తి పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ హాస్పిటల్‌లో చికిత్స పొందాడు. పదమూడు ఏళ్లుగా అతను మధుమేహంతో బాధపడుతూ ఉండేవాడు. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్‌లో ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
Also Read : Corona cases in India: ఒక్క రోజులో 16,764 కరోనా కేసులు- ఒమిక్రాన్ బాధితులు @ 1,270
ఇక భారత్‌లో మొదటి రెండు ఒమిక్రాన్ కేసులు 9Omicron cases) డిసెంబర్ 2న కర్ణాటకలో బయటపడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 14 కల్లా ఈ కేసుల సంఖ్య 50కి చేరడం, తర్వాత ఇదే నెల 17 నాటికి కేసులు వందకు చేరాయి. ఇక తర్వాత వేగంగా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు మనదేశంలో 395 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 810గా ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు లేవు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మిజోరాం, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెద్దగా లేవు.
ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,764 మందికి కోవిడ్ (Covid) నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కోవిడ్ (Covid) తీవ్ర రూపం దాల్చుతోంది. అక్కడ ఒక్క రోజులోనే 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ (Omicron) కేసుల్లో దాదాపు సగం అంటే 450 వరకు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.
Also Read : Khiladi Third Single: రవితేజ 'ఖిలాడీ' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook