India Covid Cases Today: దేశంలో లక్ష దాటికి కరోనా కేసులు- 302 మరణాలు

India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 1,17,100 కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి మరో 302 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 09:52 AM IST
    • దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు
    • కొత్తగా 1,17,100 కేసులు, 302 మరణాలు
    • కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమవుతున్న రాష్ట్రాలు
India Covid Cases Today: దేశంలో లక్ష దాటికి కరోనా కేసులు- 302 మరణాలు

India Covid Cases Today: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో లక్షకు పైగా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 1,17,100 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా మరోవైపు 30,836 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 

దేశంలో ఇప్పటి వరకు 3,43,71,845 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ ధాటికి మొత్తంగా 4,83,178 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం 3,71,363 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

వ్యాక్సినేషన్ ప్రక్రియ

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం మరో 94,47,056 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 149.66 కోట్లకు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 25,10,903 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ధాటికి గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 7,134 మరణాలు సంభవించాయి.   

Also Read: Man Attacks Bindu Ammini: శబరిమల గుడిలోకి ప్రవేశించిన బిందు అమ్మినిపై దాడి.. వీడియో వైరల్

Also Read: Corona in India: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం- ఒక్క ముంబయిలోనే 20 వేలకుపైగా కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News