Omicron cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారి సంఖ్య మొత్తం 38 కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. కొత్తగా ఒమిక్రాన్ సోకిన (Omicron infected patients) వారిలో ఇద్దరు రిస్కు లేని దేశాల నుంచి వచ్చిన వారు కాగా మరో 12 మంది ఆ జాబితాలో లేని దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా వివరాలను మీడియాకు హెల్త్ బులెటిన్ (TS health bulletin) ద్వారా వెల్లడించింది.
ఇదిలావుంటే, తెలంగాణలో కొత్తగా 37,353 మందికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా.. అందులో 182 మందికి కరోనావైరస్ (Coronavirus cases) సోకినట్టు నిర్థారణ అయింది. అదే సమయంలో ఒకరు కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 6,80,074 కి పెరగగా.. కరోనావైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 4,017 కి చేరింది.
Also read : Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో Omicron కేసు నమోదు
కొత్తగా గుర్తించిన కేసులలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనే (Corona cases in GHMC) 91 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రెండో స్థానంలో హన్మకొండ జిల్లాలో 18 కేసులు వెలుగుచూశాయి.
బుధవారం నాటి హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 196 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 6,72,447 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 3,610 కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 cases in Telangana) ఉన్నాయి.
Also read : Dry Fruits Effect: ఎప్పుడైనా ఓకే..కానీ శీతాకాలంలో అవి అస్సలు తినకూడదు
Also read : Benefits Of Jaggery: రాత్రివేళ బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Also read : Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook