Himachal Pradesh Night Curfew: లాక్ డౌన్ దిశగా మరో రాష్ట్రం.. హిమాచల్ ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ

Himachal Pradesh Night Curfew: కరోనా వైరస్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అములో ఉంటుందని తెలిపింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 08:27 AM IST
Himachal Pradesh Night Curfew: లాక్ డౌన్ దిశగా మరో రాష్ట్రం.. హిమాచల్ ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ

Himachal Pradesh Night Curfew: రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు చేస్తున్నట్లు హిమాచల్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 

సీఎం జైరామ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ ఉంటుందని జైరామ్ సర్కారు అధికారికంగా ప్రకటించింది.

కర్ఫ్యూ సందర్భంగా రాత్రి వేళలో సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, లంగర్‌లను కూడా మూసివేసివేయనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. 

బాంకెట్ హాల్స్‌తో సహా మూసివేసిన ప్రదేశాలలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఇతర సమావేశాలు 50 శాతం సామర్థ్యంతో అనుమతులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచవచ్చని సర్కారు తెలిపింది.

కరోనా వైరస్ కేసులు దేశంలో నానాటికి పెరగడం సహా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆంక్షల్లోకి జారుకున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబంగాల్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు రాత్రి వేళ కర్ఫ్యూను విధించాయి.   

Also Read: Omicron Death in India: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. కేంద్రం అధికారిక ప్రకటన

Also Read: Composite Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.634లకే LPG గ్యాస్ సిలిండర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News