Telangana Omicron Cases : తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్‌ కేసులు.. మొత్తం 41 కేసులు

3 fresh Omicron cases in Telangana : తెలంగాణలో తాజాగా మరో 3 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి.

Last Updated : Dec 25, 2021, 08:44 PM IST
  • తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభన
  • రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • తాజాగా మరో 3 ఒమిక్రాన్‌ కేసులు
  • తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41
Telangana Omicron Cases : తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్‌ కేసులు.. మొత్తం 41 కేసులు

3 fresh Omicron cases in Telangana, state tally at 41: తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు (Omicron cases) పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో తాజాగా మరో 3 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో తెలంగాణలో (Telangana) మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది.  ఇక గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ కంట్రీస్‌ నుంచి 333 మంది శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌కు వచ్చారు. వారందరికీ కోవిడ్ టెస్ట్‌లు (Covid Tests) చేశారు. 8 మందికి పాజిటివ్‌గా (Covid Positive‌) తేలింది. ఆ రిపోర్ట్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపారు. 

తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఏడు కోవిడ్ టెస్ట్‌లు చేశారు. కొత్తగా 140 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 6,80,553. ఇక గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్‌తో (Telangana Covid‌) ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కోవిడ్‌తో ప్రాణాలు కోల్పొయిన మృతుల సంఖ్య మొత్తం 4,021. కోవిడ్ నుంచి తాజాగా 186 మంది కోలుకున్నారు. 3,499 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read : Jio New Year Plan: కొత్త ఏడాదిలో కస్టమర్ల కోసం జియో సరికొత్త ఆఫర్.. హ్యాపీ న్యూఇయర్ ప్లాన్

ఒమిక్రాన్‌ (Telangana Omicron) విజృంభిస్తుండడంతో నేటి నుంచి తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు అమలుల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షల్ని విధించింది టీఎస్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ర్యాలీలు, బహిరంగ సభలకు నిషేధం విధించింది ప్రభుత్వం. మాస్క్‌ పెట్టుకోనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. న్యూ ఇయర్ (New Year) సందర్భంగా.. డిసెంబర్‌ 31 ‌‌- జనవరి 2 మధ్య తెలంగాణలో (Telangana) కోవిడ్ ఆంక్షలు మరింత కఠినంగా ఉండనున్నాయి.

Also Read : Bride Groom funny video : గుర్రం ఎక్కుదామంటే పబ్లిక్‌లో పెళ్లికొడుకు ప్యాంట్ చిరిగింది.. తర్వాత ఏం చేశాడో చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News