Omicron Cases in Tamilnadu: తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు

Omicron Cases in Tamilnadu: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కొత్తగా 45 పాజిటివ్ కేసులు నిర్ధారణ అవ్వడం వల్ల మొత్తం 295 కేసులు నమోదయ్యాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 02:00 PM IST
    • తమిళనాడులో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం
    • ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు
    • నైజీరియా నుంచి వచ్చిన ప్రయాణికులకు పాజిటివ్
Omicron Cases in Tamilnadu: తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు

Omicron Cases in Tamilnadu: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు ఈ మహమ్మారి విస్తరించగా.. తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడం ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులను కలవరానికి గురిచేస్తుంది. దీంతో దేశంలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య 295కు పెరిగింది. 

నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఆయనతో పాటు ప్రయాణించిన పలువురితో పాటు మొత్తం 89 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పరీక్షించిన నమూనాల్లో 33 నమూనాలకు.. ఫలితం ఒమిక్రాన్ పాజిటివ్​గా వచ్చాయని తెలిపారు. 13 మందికి నెగెటివ్ అని తేలిందని వివరించారు.

దీంతో తమిళనాడులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు పెరిగిందన్నారు. చెన్నైలో 26, సేలంలో ఒకటి, మధురైలో నాలుగు, తిరువన్నమలైలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు.   

మరిన్ని కేసులు..
దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పశ్చిమ బంగాల్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో బంగాల్ లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరింది.

కొత్తగా వచ్చిన ఆ రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఒకరు యూకే నుంచి నైజీరియా రాష్ట్రానికి వచ్చినట్లు ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గానే ఉందని చెప్పారు. ఇదివరకు ఏడేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకింది. ఇది బంగాల్​లో నమోదైన తొలి కేసు.

మరోవైపు రాజస్థాన్​లోని అజ్మీర్​లో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఢిల్లీ నుంచి నాలుగు రోజుల క్రితం అజ్మీర్​కు వచ్చారని అధికారులు వెల్లడించారు. బాధితుడికి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యుల వివరాలను సేకరించామని తెలిపారు. వారిని అబ్జర్వేషన్​లో ఉంచామని చెప్పారు. వారి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని స్పష్టం చేశారు. బాధితుడు ఆఫ్రికాలోని ఘనాలో పని చేస్తున్నాడని వివరించారు.

Also Read: Corona cases in India: మళ్లీ పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 434 కొవిడ్ మరణాలు

Also Read: Omicron Scare: దేశంలో కొవిడ్​​ పరిస్థితులపై నేడు ప్రధాని మోదీ సమీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News