Pawan kalyna on allu arjun Sandhya theatre stampede incident: పుష్ప2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో డిసెంబరు 4న హైదరబాద్ లోని సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో కొలుకుంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది.
అయితే.. అల్లు అర్జున్ ను ఈ ఘటనలో.. ఏ11గా చేర్చారు. బన్నీ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్ ఉత్తర్వుల మీద బైట ఉన్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. పవన్ కళ్యాణ్ అమరావతిలో సంధ్య థియటర్ ఘటనపై మాట్లాడినట్లు తెలుస్తొంది. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అంశం లో గోటితో పొయ్యే అంశానికి గొడ్డలి దాకా తీసుకొచ్చారన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వైసీపీ నేతల్లా వ్యవహరించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం బినిఫిట్ షో కి అనేక అవకాశాలు ఇచ్చిందన్నారు. అదే విధంగా టికెట్లు రేట్లు పెంచక పోతే రికార్డ్స్ ఎలా వస్తాయన్నట్లు తెలుస్తొంది. రేవంత్ రెడ్డి కాబట్టే.. మరో హీరో (అల్లు అర్జున్ ను) .. అరెస్ట్ చేయగలిగారన్నారు.
రేవంత్ పరిపాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు.మరోవైపు రేవతి ఈ ఘటనలో చనిపొవడం మాత్రం చాలా బాధకరమన్నారు. ఘటన జరగ్గానే సినిమా హీరో లేదా నిర్మాతలు లేక దర్శకుడు వాళ్ళ ఇంటికి వెళ్లి సపోర్ట్ ఇవ్వాల్సిందని పవన్ అన్నారు. మీ బాధలో మేమున్నాము అని బరోసా ఇస్తే.. ఇంత దూరం వచ్చేది కాదన్నారు.అందుకే ఇప్పుడు చాలా మంది పొగరు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి మద్దతు ఉండాలని చెబుతూనే..
ప్రత్యక్షంగా కారణం కాకపోయినా యూనిట్ మొత్తం మద్దతు ఇస్తే.. ఈరోజు ఇంతటి క్లిష్టపరిస్థితులు ఎదురయ్యేవి కాదన్నారు. కానీ యూనిట్ స్పందించకుండా.. తప్పును మొత్తంగా హీరో మీద వేసేశారన్నారు. సినిమా టీమ్ హీరోని ఒంటరిని చేసేలా ప్రవర్తించాయన్నారు. అదే విధంగా.. తాను సినిమా హళ్లకు వెళ్లనని పవన్ అన్నారు. అదే విధంగా.. ప్రజల రెస్పాన్స్ కి వెలకట్టలేని అంశమన్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో హీరో లు సినిమాలకు వెళ్లి చూసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని ఘటనలు జరిగాయన్నట్లు తెలుస్తొంది. చట్టం అనేది అందరికీ సమానమే అంటూ.. బాధితుల కుటుంబానికి.. హీరో కాకున్న.. యూనిట్ అంతా వెళ్లి భరోసా ఇస్తే బాగుండేదని పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నేపథ్యంలో మాట్లాడినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter