AAP: ఆమ్ ఆద్మీ పార్టీ. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమై జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. ఇప్పుడు మహారాష్ట్రపై దృష్టి సారించింది. త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది.
Gujarat: గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. వరుసగా ఏడవసారి బీజేపీ అధికారం చేపట్టింది. తొలిసారిగా రంగంలో దిగిన ఆప్ పరాజయం పాలైనా ఐదుగురు ఎమ్మెల్యేల్ని గెల్చుకుంది.
Gujarat Election Updates: గుజరాత్లో మొదటి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. మొత్తం 89 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Gujarat Elections 2022: దేశమంతా ఇప్పుడు గుజరాత్ ఎన్నికలవైపే దృష్టి సారించింది. అందర్నీ ఆకర్షిస్తున్న గుజరాత్ తొలిదశ పోలింగ్ రేపు అంటే డిసెంబర్ 1న జరగనుంది. తొలిదశలో రాష్ట్రంలోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Aap CM Gujarat Candidate Isudan Gadhvi: గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గద్వీ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజల అభిప్రాయం మేరకే ఆయనను ఎంపిక చేశామన్నారు.
Arvind Kejriwal On Gujarat assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కాసేపటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్ ప్రజలకు ట్విట్టర్లో సందేశం పంపించారు.
Telanagana Elections: తెలంగాణాలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన టీఆరెస్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపు ముంగిట వరకు వెళ్లి కాంగ్రెస్ ఓటమి పాలవడంపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇకాస్త కష్టపడి ఉంటే విజయం దక్కేదని విశ్లేషణలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ సాగినట్టు స్పష్టమైంది. చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధులు బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు.. ముఖ్యంగా 16 చోట్ల గెలుపొందిన.. ఓడిపోయిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 200 నుంచి 2 వేల ఓట్లలోపే ఉండటం గమనార్హం. ఏదిఏమైనప్పటికీ గుజరాత్ లో 22 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్..
ఒక వైపు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తూ.. ఒక రకంగా చెప్పాలంటే విజయం వైపు దూసుకుపోతున్న బీజేపీ.. అమ్రేలీ, నర్మద, పోరుబందర్, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో పెద్దగా రాణించకపోవడం వెనుక కారణమేమై ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.
గుజరాత్‌కు చెందిన యువ న్యాయవాది మరియు సామాజికవేత్త జిగ్నేష్ మెవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్ కుమార్ పై 21000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
గుజరాత్ ఎన్నికల్లో పటేల్ వర్గమంతా తమ వైపు ఉంటుందని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. ఆశించిన స్థాయిలో ఆ వర్గం వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం అందుతున్న సరళిని బట్టి బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా బీజేపీకే అధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తోంది.
గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారం చేపట్టాలని యోచిస్తుండగా, రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ భావిస్తోంది
ప్రస్తుత లెక్కల ప్రకారం ఓట్లలెక్కింపులో ఇప్పటికి 77 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 48 స్థానాల్లో ఓట్లలెక్కింపులో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందుంది.
గుజరాత్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ కార్యక్రమం పలువురి ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో వాటి మీద సంక్షిప్త సమాచారం మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.