YS Viveka Murder: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై తాజాగా రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్యపై వైఎస్ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశానని.. అతడు వేరొకరికి ఫోన్ ఇవ్వడంతో గుండెపోటుతో మృతి చెందారని చెప్పినట్లు వివరించారు. ఫోన్‌లో చెప్పిన సమాచారమే తాను చెప్పినట్లు వెల్లడించారు.
Also Read: Vijayasai Reddy: వైఎస్ జగన్‌కు భారీ షాక్.. విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్
రాజకీయాల నుంచి వైదొలగిన అనంతరం తన రాజ్యసభ పదవికి శనివారం రాజీనామా చేశారు. న్యూఢిల్లీలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేకా హత్యపై స్పందించారు. వైఎస్ వివేక హత్య నుంచి తప్పించుకోవడంలో భాగంగా రాజీనామా చేశాననే ఆరోపణలను ఆయన ఖండించారు.
Also Read: Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్.. రాజధాని అమరావతికి ముహూర్తం ఫిక్స్
'వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యా. వెంటనే వైఎస్ అవినాష్‌రెడ్డికి ఫోన్ చేసి అడిగా. అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారు. ఫోన్‌లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పా' అని విజయసాయి రెడ్డి వివరణ ఇచ్చారు. 'కేసుల మాఫీ కోసమే నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తగదు' అని ఖండించారు. 'ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం.. నాకు ఉంది. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవు. నా రాజీనామా వల్ల రాజ్యసభ సీటు కూటమికి వెళ్తుంది' విజయసాయిరెడ్డి తెలిపారు.
తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని విజయసాయి రెడ్డి తెలిపారు. తన నిర్ణయంపై పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోన్‌లో మాట్లాడనని.. ఆయనతో అన్నీ మాట్లాడకే రాజీనామా చేశానని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి కూడా త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.