కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పటేల్ వర్గీయులు

Last Updated : Dec 18, 2017, 01:59 PM IST
కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పటేల్ వర్గీయులు

గుజరాత్ ఎన్నికల్లో పటేల్ వర్గమంతా తమ వైపు ఉంటుందని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. ఆశించిన స్థాయిలో ఆ వర్గం వారు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం అందుతున్న సరళిని బట్టి బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా బీజేపీకే అధిక ఓట్లు వచ్చినట్టు తెలుస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ కనిపిస్తోంది.

Trending News