Chandrababu on Vijaya Sai Reddy Resignation in Telugu: వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, వెంటనే ఆమోదం చకచకా జరిగిపోయాయి. రాజకీయంలో సంచలనం కల్గిస్తున్న ఈ వ్యవహారంపై అందరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. విజయ సాయి రెడ్డి రాజీనామా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిపారేశారు.
ఇక నుంచి రాజకీయాలకు గుడ్ బై, వ్యవసాయం చేసుకుంటానంటూ నిన్న అంటే శుక్రవారం ట్వీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఇవాళ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించడం, ఆయన ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. రాజీనామా అనంతరం విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో చర్చించిన తరువాతే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్‌గా మారలేదని, వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని చెప్పారు. భవిష్యత్తులో ఇక రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. తనలాంటివాళ్లు వెయ్యి మంది పోయినా వైఎస్ జగన్ కు ప్రజాదరణ తగ్గదన్నారు.
ఇక విజయ సాయి రెడ్డి రాజీనామా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అందరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న, హోంమంత్రి అనితలు స్పందించారు. రాజీనామా చేసినా చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని, ఇదంతా జగన్, విజయ సాయి రెడ్డి కలిపి ఆడుతున్న డ్రామా అంటూ అభివర్ణించారు. మరోవైపు విజయ సాయి రెడ్డి రాజీనామాపై చంద్రబాబు సైతం స్పందించారు. దావోస్ పర్యటన వివరాలపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ అంశంపై స్పందించారు. నమ్మకముంటే ఉంటారు..లేకపోతే వెళ్లిపోతారని ఇది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వ్యక్తిగత కోపంతో వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. రాజకీయాల్లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు వస్తే ఇదే పరిస్థితి ఉంటుందన్నారు చంద్రబాబు.
Also read: Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికల్లో గాలిపటం, గెలిచేందుకా, ఓట్లు చీల్చేందుకా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి