Republic Day 2025: రేపు జనవరి 26 రిపబ్లిక్ డే సంబరాలు దేశమంతా ఓ పండుగలా జరగబోతున్నాయి. 76వ గణతంత్ర వేడుకలకు దేశ రాజధానిలోని రెడ్ ఫోర్ట్ మరోసారి సిద్ధమైంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో ఈసారి కన్పించనున్న ప్రత్యేకతలు, విశేషాలేవో తెలుసా..
ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకతలు, విశేషాలు మారుతుంటాయి. ఢిల్లీలోని విజయ్ చౌక్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక పరేడ్ కర్తవ్య పథ్ మీదుగా రెడ్ ఫోర్ట్‌కు చేరుకుంటుంది. ఈసారి అంటే 76వ గణతంత్ర వేడుకల ప్రత్యేక థీమ్ స్వర్ణ భారతదేశం-వారసత్వం పురోగతి కాగా ప్రత్యేక పరేడ్ గంటన్నర ఉంటుంది. ఈసారి పరేడ్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్నించి 31 శకటాలు, 18 మంది మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొంటాయి. మొత్తం 5 వేల మంది కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులకు కనులవిందు చేస్తాయి.
మొట్టమొదటిసారిగా
ఈసారి వేడుకల్లో మొట్టమొదటిసారి అంటే గణతంత్ర వేడుకల చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన ఒకే ఉమ్మడి శకటం ప్రదర్శితం కానుంది. ఇప్పటి వరకూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి మూడు శకటాలు ప్రదర్శనలో ఉండేవి. కానీ ఈసారి మూడు విభాగాల్ని సమన్వయం చేస్తూ ఉమ్మడి శకటం కన్పిస్తుంది. ఈసారి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అదే విధంగా తొలిసారి ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్, బ్యాండ్ బృందం కూడా పొల్గొంటుంది. అంతకు ముందు అంటే 1950 తొలి గణతంత్ర వేడుకలకు అదే దేశపు అప్పటి అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈసారి గణతంత్ర వేడుకల కవాతులో ఎప్పటిలా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, హర్యానా, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళా ప్రాముఖ్యతను తెలిపే శకటం కూడా ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వేడుకలు జరిగే ప్రదేశంలో యాంటీ ద్రోన్ వ్యవస్థ ఏర్పాటైంది. అతిధుల్ని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. ఆర్మీ చాపర్లు గస్తీ చేస్తుంటాయి. వీటికి తోడు ఎస్ఎస్జి కమాండోలు, ఢిల్లీ పోలీసులు, పారా మిలిటరీ బలగాలు, డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రత్యేక భద్రతలో ఉంటారు.
Also read: Ind vs Eng: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండవ టీ20 నేడే, ఇరు జట్ల బలాబలాలు, పిచ్ స్వభావం ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి