గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లగాను జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. కౌంటింగ్ మాత్రం సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
గుజరాత్ పోల్స్ సందర్భంగా ఈవీఎం రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని.. అందుకే ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అన్ని చోట్లా ప్రభుత్వం ఇంటర్నెట్ బంద్ చేస్తుందని పలు నకిలీ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ఎన్నికల సంఘం ప్రజలకు తెలియజేసింది.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఒకరు స్వయాన తమ పార్టీపైనే విమర్శలు కురిపించారు. ఈ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్, బీజేపీకి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించడంతో పాటు దేశీయ కరెన్సీ బలపడడనానికి తావిస్తున్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
ప్రధాని మోడీ మోదీపై శివసేన నిప్పులు చెరిగింది. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తప్పుబట్టింది. మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ..భారత రాజకీయ వ్యవస్థను చులకన చేస్తున్నారని ఆరోపించింది. దేశ రాజకీయాల స్థాయిని మోదీ దిగజార్చారని విమర్శించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ..ప్రధాని మోడీ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ఆరోపించింది. ప్రచార సభల్లో మోదీ తీవ్ర భావోద్వేగంతో, దూకుడుగా ప్రవర్తిస్తున్నారని... ఇదంతా బీజీపీ దిగజారుడు రాజకీయాలను సూచిస్తోందని ఎద్దేవ చేసింది. శివసేన తన పత్రిక సామ్నాలో ప్రధాని మోడీని విమర్శిస్తూ కథనాన్ని ప్రచురించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసింది. సౌరాష్ట్రతో పాటు దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగడం విశేషం.
ఒకవైపు తొలివిడత ఎన్నికల పోలింగ్.. మరోవైపు రెండో విడత ప్రచారం గుజరాత్ రాష్ట్రంలో వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.
షియాల్ బేట్ గ్రామ సర్పంచ్ హమీర్ షియాల్ అక్కడి జనాలకు ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చెప్పిన తర్వాత... ఆయన అభ్యర్థన మేరకు అప్పటికే వేటకు వెళ్లినవారు కూడా తిరిగివచ్చి పోలింగ్లో పాల్గొని ఓటు వేయడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.