గుజరాత్ పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు కోట్లు ఇస్తే.. గుజరాత్ సీఎం సెక్స్ సీడీ చేస్తా..! అన్నారు. మంగళవారం జీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ గుజరాత్ లో తొలిదశ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన నవంబర్ 24, 25 తేదీల్లో ఎన్నిక ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటారు.
గుజరాత్ ఎన్నికల పోరులో భాగంగా 28 మంది అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో ఆ పార్టీ ఇప్పటి వరకు 134 అభ్యర్ధులను ప్రకటించింది. తొలి దశలో 70 అభ్యర్ధులను ప్రకటించగా.. రెండో దశలో 36 మంది అభ్యర్ధులను ప్రకటించింది. కాగా మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నకల్లో పోటీ చేసే అభ్యర్ధులను దశలవారిగా ప్రకటిస్తోంది.
గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్తో కలిసి మిత్రపక్షంగా బరిలో దిగుతుందని భావించిన శరత్ పవార్ పార్టీ (ఎస్పీపీ) ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది.
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎన్నికల నగారా మ్రోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ విడుదల చేశారు. మొత్తం రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 9, 14 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 18న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 50 వేల 128 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 4.33 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.