AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ

AAP: ఆమ్ ఆద్మీ పార్టీ. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమై జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. ఇప్పుడు మహారాష్ట్రపై దృష్టి సారించింది. త్వరలో జరగనున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2023, 07:51 AM IST
AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ

ఢిల్లీలో వరుసగా మూడు పర్యాయాలు అధికారం చేజిక్కించుకుని, ఇటీవలే పంజాబ్ పగ్గాలు సాధించిన ఆప్..దేశవ్యాప్తమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆప్ దృష్టి మహారాష్ట్రపై పడింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో త్వరలో మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో తలపడనుందని ఆప్ మహారాష్ట్ర యూనిట్ తెలిపింది.

జాతీయ పార్టీగా మారిన తరువాత ఆప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై దృష్టి పెడుతున్నారు. తక్షణ చర్యగా మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించింది. త్వరలో జరగనున్న బీఎంసీ ఎన్నికల్లో ఆప్ పోటి చేయనుందని ఆ పార్టీ మహారాష్ట్ర యూనిట్ ఛీఫ్ ప్రీతి శర్మ మీనన్ తెలిపారు. ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. 

రాష్ట్రంలో విద్యుత్, ఆరోగ్యం, నీరు, రోడ్లు, పరిశుభ్రత వంటి అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుందని ప్రీతి శర్మ మీనన్ తెలిపారు. దేశ ఆర్ధిక రాజధాని ముంబై ప్రజల అవసరాలు తీర్చడంలో, సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ సహా ఏ పార్టీ సీరియస్‌గా లేదన్నారు. గుజరాత్ ఎన్నికల్లో 13 శాతం ఓట్లు సాధించడంతో ఆ పార్టీ దూకుడు పెరుగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 5 ఎమ్మెల్యే స్థానాల్ని గెల్చుకుంది. ఇటీవలే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆప్ కైవసం చేసుకుంది. 

మహారాష్ట్రలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మహా వితారాన్‌ను అదానీ గ్రూపుకు అప్పగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ ఆరోపించింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముంబై, థానే, నాసిక్, రాయగఢ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ కార్మికుల సమ్మెకు ఆప్ మద్దతు పలికింది.

Also read: NEET PG 2023: నీట్ పీజీ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడు, పరీక్ష ఎన్ని మార్కులకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News