ప్చ్.. కాస్త కష్టపడితే కాంగ్రెస్‌కు విజయం దక్కి ఉండేది

Last Updated : Dec 19, 2017, 09:46 AM IST
ప్చ్.. కాస్త కష్టపడితే కాంగ్రెస్‌కు విజయం దక్కి ఉండేది

 దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపు ముంగిట వరకు వెళ్లి కాంగ్రెస్ ఓటమి పాలవడంపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇకాస్త కష్టపడి ఉంటే విజయం దక్కేదని విశ్లేషణలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో  హోరాహోరీ పోటీ సాగినట్టు స్పష్టమైంది. చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధులు బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు.. ముఖ్యంగా 16 చోట్ల గెలుపొందిన.. ఓడిపోయిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 200 నుంచి 2 వేల ఓట్లలోపే ఉండటం గమనార్హం. ఏదిఏమైనప్పటికీ గుజరాత్ లో 22 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగిన కాంగ్రెస్.. ఇంకాస్త కష్టపడితే ఫలితం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు..కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ మేరకు ఆత్మపరిశీలన చేసుకుంటోంది.

Trending News