Gujarat Election Updates: గుజరాత్‌లో మొదటి దశ 89 స్థానాలకు ఓటింగ్ గురువారం ప్రారంభమైంది. మన దేశంలోని మినీ ఆఫ్రికన్ గ్రామం జంబూర్ ప్రజలు ఈరోజు మొదటిసారిగా తమ ప్రత్యేక గిరిజన బూత్‌లో ఓటు వేయనున్నారు. దీంతో ఈ మినీ ఆఫ్రికన్ గ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రత్యేక గిరిజన బూత్‌లో ఓటు వేయడానికి ముందు గ్రామం అంతా సంతోషకరమైన వాతావరణం నెలకొంది.
జంబూరు గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ రెహమాన్ మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఏళ్ల తరబడి ఈ గ్రామంలో నివసిస్తున్నామన్నారు. అయితే ఇది మొదటిసారి తమ గ్రామంలో బూత్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
"చాలా సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఆఫ్రికా నుంచి వచ్చారు. జునాగఢ్‌లో కోటను నిర్మిస్తున్నప్పుడు పని కోసం ఇక్కడకు వచ్చారు. మేము మొదట రతన్‌పూర్ గ్రామంలో స్థిరపడ్డాం. తరువాత క్రమంగా జాన్వార్లు గ్రామంలో స్థిరపడ్డారు. మాకు సిద్ధి గిరిజన సంఘం హోదా వచ్చింది. మేము అంతా భారతదేశం, గుజరాత్ సంప్రదాయాలను పాటిస్తున్నాం.." అని అన్నారు.
తలాలా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అబ్దుల్ మగుజ్ భాయ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో స్థానిక ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. "గ్రామం రెండు నదుల మధ్య ఉంది. ఇక్కడ అందరూ కలిసి జీవిస్తున్నారు. నేను మూడవసారి ఇక్కడ నుండి పోటీ చేస్తున్నాను. మేము కూడా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నాము. మేము మరిన్ని మంచి పని చేసేలా హక్కులు పొందాలి. ఈ ప్రాంతాన్ని ఆఫ్రికా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. తమను సిద్ధి గిరిజన సంఘం అని పిలుస్తారు. ప్రభుత్వం గిరిజనులకు సహాయం చేస్తూనే ఉంది. ఇందులో ఎటువంటి సమస్య లేదు. కానీ మా స్థానిక సమాజానికి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మాకు అంత సౌకర్యాలు లేవు.." అని ఆయన చెప్పారు.
గుజరాత్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 39 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా 718 మంది పురుష అభ్యర్థులు, 70 మంది మహిళా అభ్యర్థులు సహా 788 మంది అభ్యర్థులను బరిలో ఉన్నారు. గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న మిగిలిన 93 స్థానాలకు జరగనుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న రానున్నాయి.
Also Read: MLC Kavitha Delhi Liquor Scam : జైల్లో పెట్టడం కంటే, ఎక్కువ చేసేది ఏమి లేదు.. ఎమ్మెల్సీ కవిత
Also Read: 7th pay commission: కేంద్ర ఉద్యోగులకు మరో బంపర్ గిఫ్ట్.. ట్రావెల్ అలవెన్స్ పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి