UPS Full Benefits: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. రిటైర్మెంట్ తరువాత ఉద్యోగులకు ఆర్ధికంగా భరోసా ఇచ్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ రూపకల్పన చేసింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్-నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లోని కొన్ని ప్రయోజనాలతో రూపొందింది.
చాలా కాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్‌పై వ్యతిరేకత వ్యక్తమౌతోంది. పాత పెన్షన్ విధానమే కొనసాగించాలనే డిమాండ్ విన్పిస్తోంది. ఉద్యోగుల కోరిక మేరకు కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్నే కొనసాగిస్తుండగా మరి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా నేషనల్ పెన్షన్ సిస్టమ్ నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండింటినీ సమ్మిళితం చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో రిజిస్టర్ అయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
యూపీఎస్ అర్హత ఎవరెవరికి
ఈ కొత్త విధానం పదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకే వర్తిస్తుంది. ఈ స్కీమ్ ప్రకారం పదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు రిటైర్ అయిన తేదీ నుంచి పెన్షన్ అందుతుంది. ఎలాంటి పెనాల్టీలు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు అదే తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది. 25 ఏళ్లు అంతకంటే ఎక్కువ సర్వీసు తరువాత వీఆర్ఎస్ తీసుకుంటే మాత్రం ఆ ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది. ఉద్యోగం మానేసిన లేదా తొలగించబడినవారికి యూపీఎస్ ప్రయోజనాలు అందవు.
పెన్షన్ లెక్కింపు ఎలా
యూపీఎస్ విధానంలో పెన్షన్ లెక్కింపు ఎన్నేళ్లు సర్వీసు చేశారనేదానిని బట్టి ఉంటుంది. 25 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉంటే చివరి 12 నెలల కనీస వేతనం సరాసరిలో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. 25 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉంటే మాత్రం సదరు ఉద్యోగుల సర్వీసు ఆధారంగా ఇస్తారు. పదేళ్లు అంతకంటే ఎక్కువ సర్వీసు కలిగి ఉంటే నెలకు 10 వేల రూపాయలు ఫిక్స్డ్ పెన్షన్ ఉంటుంది. పెన్షనర్ మరణిస్తే భార్య లేదా భర్తకు 60 శాతం పెన్షన్ లభిస్తుంది.
డీఆర్ ఇతర ప్రయోజనాలు
యూపీఎస్ ప్రకారం సదరు ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు డియర్నెస్ రిలీఫ్ వర్తిస్తుంది. పెన్షన్ మొదలైన తరువాత ఈ ప్రయోజనం లభిస్తుంది.మొత్తం నెల జీతంలో 10 శాతాన్ని ప్రతి ఆరు నెలలకోసారి లెక్కించి రిటైర్మెంట్ సమయంలో ఇస్తారు. ఇది పెన్షన్‌పై ప్రభావం చూపించదు. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా అమల్లోకి వస్తోంది. ఎన్పీఎస్ లేదా యూపీఎస్‌లో ఏదో ఒకటి ఉద్యోగులు ఎంచుకోవచ్చు. త్వరగా రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఆప్షన్ ఉంటుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సెక్యురిటీ కల్గిస్తుంది. ఉద్యోగులకు ఇది పూర్తిగా లాభదాయకమే.
Also read: Railway Ticket Concession: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్, రైల్వే టికెట్ల రాయితీపై బడ్జెట్లో ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి