అనూహ్య మలుపు.. మళ్లీ తేరుకున్న "కమల నాథులు"

కాంగ్రెస్ పార్టీ మంచి పోటీనే ఇస్తున్నప్పటికీ.. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే మళ్లీ తేరుకుంది మోదీ సేన. 

Last Updated : Dec 18, 2017, 11:46 AM IST
అనూహ్య మలుపు.. మళ్లీ తేరుకున్న "కమల నాథులు"

కాంగ్రెస్ పార్టీ మంచి పోటీనే ఇస్తున్నప్పటికీ.. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే మళ్లీ తేరుకుంది మోదీ సేన. ప్రస్తుత వార్తల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 105 స్థానాల్లో లీడ్ తీసుకోగా.. కాంగ్రెస్ 73 స్థానాలకే పరిమితమవడం గమనార్హం. అలాగే హిమాచల్ ప్రాంతంలో బీజేపీ 40 సీట్లతో లీడ్ తీసుకోగా.. కాంగ్రెస్ 22 స్థానాలకే పరిమితమైంది. 

ప్రస్తుతం అనేక కీలకమైన స్థానాల్లో బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. 

మోదీ సేన మళ్లీ ఓట్ల లెక్కింపులో ముందుంది అన్న వార్తలు రాగానే.. సెన్సెక్స్ లాభాల బాట పట్టిందని పలువురు ఆర్థిక నిపుణులు అంటున్నారు.

అయితే హిమాచల్‌లో పరిస్థితి వేరేగా ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు

Trending News