గెలుపు ఎవరి వైపు.. ఇదో ఆసక్తికరమైన ఆట..!

గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారం చేపట్టాలని యోచిస్తుండగా, రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని  కాంగ్రెస్‌ భావిస్తోంది

Last Updated : Dec 18, 2017, 10:07 AM IST
గెలుపు ఎవరి వైపు.. ఇదో ఆసక్తికరమైన ఆట..!

గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారం చేపట్టాలని యోచిస్తుండగా, రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని  కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో ఒక ఆసక్తికరమైన ఆట నడుస్తోంది. ముఖ్యంగా గుజరాత్‌ వికాసానికి బీజేపీ నీళ్లొదిలిందని, దాని భవిష్యత్తు ఇప్పుడు సంకటస్థితిలో పడిందని, కాంగ్రెస్‌ మోదీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడింది.

దీనితో పాటు పటిదార్‌ రిజర్వేషన్‌, ఓబీసీ రిజర్వేషన్ వంటి అంశాలను హైలట్ చేస్తూ బీజేపీను ఎలాగైనా అధికారం నుంచి తప్పించాలనే ధ్యేయంతోనే కాంగ్రెస్‌ ముందుకు వెళ్లింది. అయితే బీజేపీ విజయంపై ఎగ్జిట్ పోల్ సర్వేలు పాజిటివ్‌గానే జరిగాయి. అయితే.. ఇప్పుడు ఒక సస్పెన్స్ సినిమాలాగే ఈ ఇరు పార్టీలలో గెలుపెవరిది అన్న అంశం తెరమీదికొచ్చింది. 

తాజా వార్తల ప్రకారం గుజరాత్‌లో బీజేపీ 94 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 86 స్థానాల్లో.. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

గుజరాత్ ప్రజల వారు ఎదుర్కొన్న అనుభవాల రీత్యా, కాంగ్రెస్‌ను గెలిపిస్తారని అనుకుంటున్నాం అని కాంగ్రెస్ గుజరాత్ పార్టీ స్టేట్ ఇంఛార్జి అశోక్ గెహ్లాట్ తెలిపారు 

ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య గట్టిపోటీనే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

 

Trending News