Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ దూకుడు.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

Aap CM Gujarat Candidate Isudan Gadhvi: గుజరాత్‌లో ఆప్ సీఎం అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గద్వీ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజల అభిప్రాయం మేరకే ఆయనను ఎంపిక చేశామన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 04:26 PM IST
Gujarat Elections: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ దూకుడు.. సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

Aap CM Gujarat Candidate Isudan Gadhvi: గుజరాత్ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్ని పార్టీల కంటే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే 'గుజరాత్ ప్రజలు ఈసారి పెద్ద మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. కచ్చితంగా గెలుస్తాం.. గుజరాత్ ప్రజలకు నా ప్రేమపూర్వక సందేశం..' అంటూ ట్వీట్ చేసి సిగ్నల్ పంపించారు. తాజాగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి పోటీకి సై అంటూ మరింత వేగం పెంచారు.

గుజరాత్‌లో ఆప్ సీఎం అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గద్వీని నిలబెడుతున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ యూనిట్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జనరల్ సెక్రటరీ మనోజ్ సొరాథియా పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా.. ఇసుదాన్ గద్వీనే ఆయన ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడారు.

'రూమ్‌లో కూర్చుని మా సీఎం అభ్యర్థి ఎవరనేది మేం నిర్ణయించం. పంజాబ్‌లో భగవంత్ మాన్‌ను సీఎం అభ్యర్థి కేజ్రీవాల్ ఎన్నుకోలేదు. పంజాబ్ ప్రజలు ఆయనను ఎన్నుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలని పంజాబ్ ప్రజలను అడిగాం. వారి నిర్ణయం మేరకే అప్పుడు భగవంత్ పేరును ప్రకటించాం. ఇప్పుడు కూడా అలానే ప్రజలను అడిగాం. 73 శాతం మంది ప్రజలు ఇషుదాన్ గాధ్వి పేరును ఎంపిక చేశారు' అని కేజ్రీవాల్ తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాలని తాము గుజరాత్ ప్రజలను కోరామని.. ప్రజలు భారీగా ఓట్లు వేశారని అన్నారు. దాదాపు 16 లక్షల 48 వేల 500  మంది స్పందించారని తెలిపారు. 73 శాతం మంది ఇషుదాన్ గద్వీ పేరును సెలెక్ట్ చేశారని వెల్లడించారు. 

ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కేజ్రీవాల్ గత వారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో వారి అభిప్రాయాలను తెలియజేయడానికి SMS, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ-మెయిల్ ద్వారా పార్టీని సంప్రదించాలని సూచించారు. పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలో కూడా నిర్ణయించాలని నవంబర్ 3 సాయంత్రం వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును నవంబర్ 4న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్లే శనివారం గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న మొదటి దశ, డిసెంబర్ 5న రెండోదశ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read: CM KCR Videos: జబర్దస్త్ కామెడీ షో.. సీఎం కేసీఆర్ వీడియోలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ కౌంటర్  

Also Read: Chandragrahanam Effect: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. ఈ నెల 8న శ్రీవారి ఆలయం మూసివేత  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News