CM KCR: ముందస్తుకే కేసీఆర్ మొగ్గు.. ఈనెలలోనే అసెంబ్లీ రద్దు? అంతా పీకే డైరెక్షన్..

Telanagana Elections: తెలంగాణాలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన టీఆరెస్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 2, 2022, 12:51 PM IST
  • అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ మొగ్గు
  • ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు
  • సర్వేల ఆధారంగానే సీట్లు
CM KCR: ముందస్తుకే కేసీఆర్ మొగ్గు.. ఈనెలలోనే అసెంబ్లీ రద్దు? అంతా పీకే డైరెక్షన్..

Telanagana Elections: తెలంగాణాలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన టీఆరెస్ ముందస్తుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ముందస్తుకు వెళ్లేదిలేదంటూ కెసిఆర్, కేటీఆర్ లు పదేపదే చెప్తున్నా అది కేవలం విపక్షాలను తప్పుదోవపట్టించే వ్యూహంలో భాగమే అంటున్నారు. ముందస్తుకు వెళ్తేనే టీఆర్ఎస్ కు   మేలని ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇచ్చిన నివేదికతో.. ఆ దిశగా గులాబీ బాస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఏదైనా రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తే తిరిగి ఆరు నెలల్లోపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అదే సమయంలో ఇతర రాష్ట్రాల అసెంబ్లీకి, లోక్ సభ ఎన్నికలు ఉంటె వాటితో కలిపి ఎన్నిక నిర్వహిస్తుంది.ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2023 మేలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే తెలంగాణ అసెంబ్లీని ఈనెలలోనే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. లేదంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలోతోనే వెళ్లాల్సి ఉంటుంది.

2018 లో హడావిడిగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లిన కెసిఆర్ కు ఆ ఎన్నికలు బాగానే కలిసివచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు తేరుకునేలోపే తన ఆలోచనను అమలులో పెట్టి కెసిఆర్ రెండోసారి టీఆరెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. జనరల్ ఎలక్షన్స్ తోపాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అది బీజేపీ కే లబ్ది చేకూరుతుందని కేసీఆర్ భావించారు. అందుకే ముందస్తుకు వెళ్లారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ అంచనాలను నిజం చేశాయి. గులాబీ బాస్  అంచనాలకు తగ్గట్లే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ కు కలిసి రాగా.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్ లో కవిత ఓడిపోవడం టీఆర్ఎస్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది.

టీఆర్ఎస్ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేస్తోంది. కేసీఆర్ చేతికి పీకే టీమ్ సర్వేలు వెళ్లాయి. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో మరో నివేదికను పీకే ఇచ్చారని తెలుస్తోంది. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రజల మనోగతం, అభ్యర్థులను మార్చితే ఫలితం ఏమైనా మారుతుందా? సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై పీకే టీం సర్వే చేస్తుండగా, వాటి ఫలితాల ఆధారంగానే సీట్లు కేటాయించాలని కేసిఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆరెస్ అధిష్టానం ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై, కొంతమంది మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో అవసరమైతే వారిని మార్చేందుకు సైతం వెనుకాడొద్దని టీఆరెస్ అధిష్టానం ఆలోచనగా ఉందంటున్నారు.

గత అనుభవం దృష్ట్యా ఎంపీ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని కెసిఆర్ కు తెలియనిది కాదు. 2018 లో అనుసరించిన వ్యూహాన్నే ఈదపా అమలు చేయాలనీ కెసిఆర్ కృతనిశ్చయం తో ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని కేసిఆర్ భావిస్తున్నారు. వరుసగా మూడోవసారి టీఆరెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి, జాతీయరాజకీయాల్లో బలమైన నేతగా ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కెసిఆర్ కు ఇప్పుడు అత్యవసరం. అందుకే ముందస్తుకు వెళ్లి రాష్ట్రంలో సత్తా చాటాలని కెసిఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా కెసిఆర్ ముందస్తు ఎన్నికలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికల్లో విజయం సాధిస్తే సరి లేదంటే మాత్రం  కేసిఆర్ కలలు కంటున్న జాతీయ రాజకీయాలపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందనే భయం టీఆర్ఎస్ కేడర్ లో కనిపిస్తుంది.

Read also: MP SON ROBBED: టీఆర్ఎస్ ఎంపీ కొడుకు దారి దోపిడి.. హైదరాబాద్ లో ఇంత అరాచకమా!

Read also: Lawyer Murdered: సంచలనం రేపుతున్న న్యాయవాది హత్య.. కత్తులతో పొడిచి చంపిన దుండగులు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News