YSRCP MP Raghurama Krishnam Raju: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ గతంలో లేఖలు రాసిన రఘురామ కృష్ణ రాజు.. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాల (Pelli Kanuka scheme, Shadi mubarak scheme) కింద అందించే ఆర్థిక సహాయం పెంపుపై ఇచ్చిన హామీ గురించి తన లేఖలో ప్రస్తావించారు.
AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.
2 Years Of YS Jagan Rule In AP: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండేళ్లలోనే సువర్ణ ఘట్టాన్ని ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫోకస్ చేశారని కొనియాడారు.
Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.
MP Raghuramakrishnam Raju arrested on charges of sedition: హైదరాబాద్: వైసీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ అరెస్ట్ జరిగింది. గత కొంతకాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (AP CM YS Jagan) రఘురామ కృష్ణం రాజు పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Nara Lokesh booked in Criminal case: అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం జిల్లా రాయదుర్గ్ నియోజకవర్గం పరిధిలోని డి హిరేహాల్ పోలీసు స్టేషన్లో ఓ క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీ ఎస్టీ సెల్ నాయకుడు భోజరాజు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నారా లోకేష్‌పై (FIR filed on Nara Lokesh) కేసు నమోదు చేశారు.
Tirupati Bypoll Results Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఊహించినట్టే అధికార పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టే భారీ మెజార్టీ సాధించబోతుందా..
Tirupati by polls: తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అప్పటివరకు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. చివర్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కరోనావైరస్తో బాధపడుతున్న పేషంట్స్‌కు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
AP High Court : గతంలో విడుదలైన పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఏపీ నూతన ఎస్ఈసీ ముందుకు వెళ్లడం, ఎన్నికలు కొనసాగాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓవైపు టీడీపీ ఎన్నికలను బహిష్కరించగా, బీజేపీ మరియు జనసేన పార్టీలు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేశాయి.
Pawan Kalyan comments on CM post: తిరుపతి: తనకు సీఎం పదవిపై ఆశ లేదని.. సీఎం కాకపోయినా సేవ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం అయితేనే అని కాదు.. కాకపోయినా సరే ఇంకా ఎక్కువ సేవే చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సామాన్యులపై అధికార పార్టీ (YSRCP) ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు.
TDP Boycott Election: బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై ఏపీ ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు టీడీపీ బహిష్కరిస్తున్నట్లు కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
YSRCP MLA Venkata Subbaiah Passed Away : గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సుబ్బయ్య గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు
Election Code In AP 2021: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఒక ప్రకటన జారీ చేశారు.
JC Prabhakar Reddy, Tadipatri Municipal Chairman : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనుకున్నది సాధించింది. తాము సత్తా చాటిన ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
Tadipatri Municipal Chairman Election Updates: ఏపీ ప్రజలు సైతం అధికార వికేంద్రీకరణకు ఓటు వేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు తెలిపారు. అనంతరంపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలు మినహా అన్ని మున్సిపాలిటీలలోనూ వైఎస్సార్సీపీ విజయదుందుబి మోగించింది.
AP Municipal Election Results 2021 | పలు మున్సిపాలిటీలతో మొత్తం వార్డులు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ, పలు చోట్ల మెజార్టీ స్థానాలలో గెలుపొందింది. టీడీపీకి పట్టున్న అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో ఆ పార్టీ బోణీ కొట్టింది.
YSRCP In Municipal Elections 2021 Results: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైఎస్సార్సీపీ దూసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను వైఎస్సార్సీపీ రిపీట్ చేస్తోంది.
YS Jagan On YSRCP Formation Day: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విలువలు, విశ్వసనీయతను మరింత ముందుకు తీసుకెళుతూ వైఎస్ జగన్ స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఆయన శ్రమకు తగ్గ ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.