AP CM YS Jagan Delhi Tour: ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన

AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, ప్రకాష్ జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 11, 2021, 03:05 PM IST
AP CM YS Jagan Delhi Tour: ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన

AP CM YS Jagan Delhi Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, ప్రకాష్ జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను కలుసుకుని ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys Jagan Delhi Tour) గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రో వర్సిటీ ఏర్పాటు, కాకినాడ పెట్రో కాంప్లెక్స్ సహా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని కోరారు. ప్రత్యామ్నాయాలను సైతం కేంద్ర మంత్రికి ఏపీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పెట్రోలియంశాఖ కార్యదర్శులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read: Ys Jagan Delhi Tour: వైఎస్ జగన్ రెండ్రోజులు ఢిల్లీలో బిజీ, పర్యటన వివరాలివీ

అనంతరం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, నూతన లైన్ల ఏర్పాటు అంశాలపై వైఎస్ జగన్ చర్చించారు. దీంతో ఏపీ సీఎం రెండురోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. అనంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఏపీకి బయలుదేరారు. కాగా, తొలిరోజు పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం రాత్రి 9 నుంచి దాదాపు గంటన్నరసేపు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కోరడంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని వివరించారు.

Also Read: AP DSC 2008 : ఏపీ డీఎస్సీ 2008 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News