Tirupati Bypoll Results Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఊహించినట్టే అధికార పార్టీ పూర్తి ఆధిక్యతను కనబరుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టే భారీ మెజార్టీ సాధించబోతుందా..
ఏపీ తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక (Tirupati Bypoll Results) ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ స్థానం నుంచి అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డాక్టర్ గురుమూర్తి, బీజేపీ (Bjp) తరపున రత్నప్రభ, టీడీపీ (TDP) తరపున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ భారీ మెజార్టీ 5 లక్షల వరకూ వస్తుందనే అంచనాలతో ఉంది. పార్టీ ఊహించినట్టే అధికార పార్టీ భారీ మెజార్టీ దిశగా ఆధిక్యం కనబరుస్తోంది.
తిరుపతి ఉపఎన్నికలో ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr Congress party) అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి 56 వేల ఓట్ల మెజార్టీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధికి 1 లక్షా 47 వేల ఓట్లు దక్కగా..టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 85 వేల ఓట్లు వచ్చాయి. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook