TDP Boycott Election: ఏపీలో ప్రజాస్వామ్యం కరువైందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై ఏపీ ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు టీడీపీ బహిష్కరిస్తున్నట్లు కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ నిర్ణయాన్ని చంద్రబాబు వెల్లడించారు.
అక్రమాలు జరిగాయని చెబుతున్నా, విచారణ చేపట్టకుండా ఎన్నికలను కొనసాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ నూతన ఎస్ఈసీ రావడంతోనే ఎన్నికల షెడ్యూల్ తీసుకురావడం తమకు అర్థం కావడం లేదన్నారు. పొలిట్ బ్యూరో లో నిర్ణయం మేరకు, ఏపీ ఎస్ఈసీ తీరును తప్పు పడుతూ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రకటించారు. ఎన్నికల బహిష్కరణ కఠిన నిర్ణయమే, అయినా తప్పదం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎస్ఈసీ రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారని వ్యాఖ్యానించారు.
Also Read: West Bengal Election 2021: ముందు అమిత్ షాను కంట్రోల్ చెయండి, PM Modiకి మమతా బెనర్జీ సవాల్
2014లో 2 శాతం ఎంపీటీసీలు, 1 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవమైతే.. తాజాగా 24 శాతం ఎంపీటీసీలు, 19 శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపే పరిస్థితి ఏపీలో లేదని చంద్రబాబు ఆరోపించారు. పరిషత్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతున్నాయని నమ్మకం లేనందున ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వైఎఎస్సార్‌సీపీ(YSRCP) అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల కీలక నేతలు సైతం స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.
కాగా, అంతకుముందు ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook