Venkata Subbaiah Death News: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య కన్నుమూత, ప్రముఖుల సంతాపం

YSRCP MLA Venkata Subbaiah Passed Away : గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సుబ్బయ్య గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు

Written by - Shankar Dukanam | Last Updated : Mar 28, 2021, 12:53 PM IST
Venkata Subbaiah Death News: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య కన్నుమూత, ప్రముఖుల సంతాపం

YSRCP MLA Venkata Subbaiah Passed Away: అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సుబ్బయ్య గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

రాజకీయాల్లోకి రాక ముందు వెంకట సుబ్బయ్య డాక్టర్‌గా సేవలు అందించారు. ఆర్థోపెడిక్ సర్జన్‌గా కొన్నేళ్లపాటు సేవలు అందించిన ఆయన 2016లో వైఎస్సార్‌సీపీ(YSRCP) బద్వేల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Also Read: Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది దుర్మరణం

డాక్టర్, రాజకీయ నేత వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానికులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంకయ సుబ్బయ్యకు భార్య, సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భౌతికకాయాన్ని కడప(Kadapa) జిల్లా బద్వేల్‌ మార్కెట్‌ యార్డ్‌లో ఉంచారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంటక సుబ్బయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News