Raghurama Krishnam Raju: సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన రఘురామ కృష్ణం రాజు

YSRCP MP Raghurama Krishnam Raju: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ గతంలో లేఖలు రాసిన రఘురామ కృష్ణ రాజు.. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాల (Pelli Kanuka scheme, Shadi mubarak scheme) కింద అందించే ఆర్థిక సహాయం పెంపుపై ఇచ్చిన హామీ గురించి తన లేఖలో ప్రస్తావించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2021, 06:37 AM IST
Raghurama Krishnam Raju: సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన రఘురామ కృష్ణం రాజు

YSRCP MP Raghurama Krishnam Raju: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ గతంలో లేఖలు రాసిన రఘురామ కృష్ణ రాజు.. వైసీపీ అధికారంలోకి వస్తే పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం పెంచుతామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. 

పెళ్ళి కానుక పథకం (Pelli Kanuka scheme), షాదీ ముబారక్ పథకం (Shadi mubarak scheme) కింద అందించే ఆర్థిక సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించినందు వల్లే అప్పట్లో ప్రజల నుంచి భారీ మద్దతు లభించిందని అభిప్రాయపడిన ఆయన.. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇంకా ఆ హామీని నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామిని జగన్ సర్కార్ నిలబెట్టుకోవాలని ఆయన తన లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Also read: AP Corona Update: ఏపీ రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishnam Raju) లేఖ రాయడాన్ని చూస్తే.. అరెస్టులు, కేసులతో ప్రభుత్వం తన తిరుగుబాటును ఆపలేదనే సంకేతాన్ని రఘురామ కృష్ణం రాజు ఇవ్వాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. రఘురామ కృష్ణం రాజు రాసిన ఈ లేఖపై వైసీపీ (YSRCP) శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచిచూద్దాం మరి.

Also read : YSR Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు, జూలై 1 నుంచి అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News