Election Code In AP: ఏపీలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

Election Code In AP 2021:  రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఒక ప్రకటన జారీ చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 19, 2021, 01:33 PM IST
  • ఏపీలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలప ప్రక్రియ ముగిసింది
  • ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిర్ణయం
  • మార్చి నెలాఖరులోగా నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
Election Code In AP: ఏపీలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

Election Code In AP 2021: ఏపీలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలప ప్రక్రియ గురువారం ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఒక ప్రకటన జారీ చేశారు. దాంతో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

మరోవైపు ఏపీలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులోగా వాయిదా పడిన స్థానాలకు ఎన్నికలను నిర్వహించేలా ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌(Nimmagadda Ramesh Kumar)ను ఆదేశించాలని గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కోరారు.

Also Read: YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా, ఇటీవల ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మన్ ప‌ద‌వుల్లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌కు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసింది. 86 స్థానాలకుగానూ 78 శాతం వెనుకబడిన తరగతులకు కేటాయించి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) దేశంలో సరికొత్త చరిత్ర లిఖించారు. మున్సిపల్‌ చైర్మన్, మేయర్‌ పదవుల్లో 60.4 శాతం మహిళలకు కేటాయించారు. 

Also Read: Andhra pradesh: ఆ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కూరగాయలమ్మేవ్యక్తి ఎన్నిక

పంచాయతీ ఎన్నికల సమయంలో ఫిర్యాదుల కోసం అధికార వైఎస్సార్‌సీపీ ఈనేత్రం యాప్ తీసుకొచ్చింది. అంతకుముందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈవాచ్ యాప్ లాంచ్ చేశారు. తొలుత కొన్నిరోజులు నిలిపివేసిన హైకోర్టు, అనంతరం ఏపీ ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్‌ను నిషేధించడం తెలిసిందే. అయితే ఫిర్యాదుల కోసం ఈ యాప్‌లను తీసుకొచ్చారు.

Also Read: Mydukur Municipality: ఉత్కంఠ రేపిన మైదుకూరు ఎన్నిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News