Chaganti: రంగంలోకి చాగంటి కోటేశ్వరరావు.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మార్పులకు శ్రీకారం

Chaganti Koteswara Rao Meets To Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రంగంలోకి దిగారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆయన భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 25, 2024, 06:28 PM IST
Chaganti: రంగంలోకి చాగంటి కోటేశ్వరరావు.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ మార్పులకు శ్రీకారం

Amaravati: తన ప్రవచనలతో లోక కల్యాణం కోసం కృషి చేస్తున్న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో రంగంలోకి దిగారు. సంప్రదాయ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం చాగంటి సమావేశమయ్యారు. తనకు విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల్లో సలహాలు, సూచనలు కావాలని సీఎం చంద్రబాబు కోరారు.

ఇది చదవండి: YS Sharmila: గౌతమ్ అదానీతో జగనన్న 'లంచం' ఒప్పందాన్ని రద్దు చేయండి

అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును చాగంటి కోటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా చాగంటిని సీఎం చంద్రబాబు సత్కరించారు. అంతకుముందు నారా లోకేశ్‌తో కూడా చాగంటి సమావేశమయ్యారు. చాగంటితో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి' అంటూ చాగంటిని కోరారు. తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని చాగంటి తెలిపారు.

ఇది చదవండి: Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 'కిస్సిక్' పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. నైతిక విలువలు కూడా తెలిస్తేనే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని చాగంటికి సీఎం చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. 

 

ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలను ఈ తరానికి.. భవిష్యత్ తరాలకు అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని చాగంటి తెలిపారు. విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే లోకేశ్‌‌తో చర్చించిట్లు వెల్లడించారు.

చాగంటితో సమావేశమైన తర్వాత లోకేశ్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు చేశారు. 'విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యా. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని నిర్ణయించాం. దీనికి మీ అమూల్యమైన సలహాలు అవసరం' అని కోరినట్లు లోకేశ్‌ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, సత్ప్రవర్తన పెంపొందించేందుకు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు తెలిపినట్లు లోకేశ్‌ వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News