Priyanka Vadra Gandhi Vadra :పార్లమెంట్ లో జూ.ఇందిరా గాంధీ అడుగుపెట్టబోతున్నారు. మోడీ, అమిత్ షానే టార్గెట్ గా ఆమె వ్యూహాలకు పదును పెట్టబోతుందా అంటూ ఔననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అన్నయ్య రాహుల్ గాంధీ.. వరుసగా రెండు సార్లు గెలిచిన కేరళలోని వయనాడు నియోజకవర్గంలో అన్న రాహుల్ గాంధీ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక వాద్రా.. దాదాపు అన్న రాహుల్ గాంధీని మించి 4 లక్షల 10 వేల 931 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతుంది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రియాంక వాద్రాకు.. ఇక డైరెక్ట్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేయనుంది.
ఓ వైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రాతో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ లో తిప్పలు తప్పవంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఎన్నికల ప్రచారంతో బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసిన ప్రియాంక గాంధీ...ఇక పార్లమెంట్ లో జూనియర్ ఇందిరాగాంధీలా రెచ్చిపోతుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.
వాయనాడ్ జరిగిన ఉప ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్ శాతం తగ్గినా.. ప్రియాంక గాంధీకి ఓ వర్గం ఓట్లు గంపగుత్త పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ 64.72% ఓటింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం లో ప్రియాంకకు 6.22,338 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ నుంచి సత్యమ్ మోకోరికి 2,11, 407 ఓట్లు సాధించారు. లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తరుపు నవ్య హరిదాస్ పోటీ చేసి లక్ష 9 వేల 939 ఓట్లు సాధించింది. మొత్తంగా పోలైన ఓట్లలో ప్రియాంకకు 64.99 శాతం ఓట్లు పడితే.. కమ్యూనిస్ పార్టీకి 22.08 శాతం పడ్డాయి. బీజేపీకి ఇక్కడ 11.48 శాతం పోలవ్వడం విశేషం.
2009 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కేరళలో వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రా ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 4 లక్షలకు పైగా మెజారిటీ గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ఈ రోజు ప్రియాంక గాంధీతో ఎంపీగా స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ గెలుపుతో ఒకే లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన అన్నా చెల్లెల్లుగా రాహుల్ గాంధీ, ప్రియాంక రికార్డు క్రియేట్ చేసారు. మరోవైపు తల్లి సోనియా గాంధీ.. రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మొత్తంగా ఉభయ సభల్లో కలిపి ఒకే ఇంటి నుంచి ముగ్గురు పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహించిడం ఓ రికార్డు అని చెప్పాలి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter