Prabhas Hospitality on Set ప్రభాస్ ఆతిథ్యం గురించి సౌత్, నార్త్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది. అయితే ప్రభాస్ హాస్పిటాలిటీ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతూనే వస్తున్నారు. తాజాగా రంగస్థలం ఫేమ్ జబర్దస్త్ మహేష్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Dasara Director Srikanth Odela దసరా సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు శ్రీకాంత్ ఓదెల. పర్ఫెక్ట్ మాస్ మసాలా కమర్షియల్ సినిమాను తీయడంలో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా శ్రీకాంత్ తన మొదటి సినిమాతోనే మెప్పించాడు.
Director Sukumar Reveals Rangasthalam Auditions: రంగస్థలం సినిమాలో సమంత కంటే ముందు ఆ రోల్ కోసం అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నామని, అయితే ఆడిషన్స్ లో ఆమె వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉండడం భయం వేసిందని చెప్పుకొచ్చారు.
Rangasthalam makers missed a Golden opportunity: అదేంటి రామ్ చరణ్ రంగస్థలం మేకర్స్ గోల్డ్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అనే అవును నిజమే, వాళ్లు నిజంగానే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఎలాగంటే?
టాలీవుడ్ లో ఇది సరికొత్త ట్రెండ్. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాని మరో స్టార్ ప్రమోట్ చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. మహేష్ బాబు సినిమాను ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తాడు. రవితేజ సినిమాకు పవన్ ప్రచారం కల్పిస్తాడు. ఇలా హీరోలంతా మరో హీరోకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రంగస్థలం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. చెర్రీ కెరీర్లో బాక్స్ ఆఫీస్ వద్ద అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్లో రంగస్థలం మూవీ నాలుగు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సన్నద్ధమవుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.175 కోట్ల వసూళ్లు పొందిన తెలుగు చిత్రంగా నిలిచింది. 'బాహుబలి' మూవీ తర్వాతి స్థానంలో ఇప్పుడు సుకుమార్ సినిమానే నెంబర్ 1 స్థానంలో ఉంది.
రంగస్థలం సినిమాలో క్లైమాక్స్‌కి ముందు వచ్చే "ఓరయ్యో నా అయ్య" సెంటిమెంట్ సాంగ్ ఆ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో చంద్రబోస్ రచించి, స్వయంగా పాడిన పాట ఆడియెన్స్ గుండెలను పిండేసింది. సినిమాలోని సన్నివేశాలను, కథాంశం ఇతివృత్తం మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన పాట ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు అన్నయ్యగా ఆది పినిశెట్టి పోషించిన కుమార్ బాబు పాత్ర మృతిచెందినప్పుడు.. రంగస్థలాన నీ పాత్ర ముగిసిందంటూ బ్యాగ్రౌండ్లో వచ్చే ఈ పాట ఆడియెన్స్ ని ఏడిపించినంత పనిచేసింది. రంగస్థలం మ్యూజిక్ పార్ట్నర్స్లో ఒకటైన టీ సిరీస్ తెలుగు తాజాగా ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.