పవన్ కల్యాణ్‌‌పై తన అభిమానాన్ని ఇలా చాటుకున్న జగ్గూ భాయ్ !

ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎంతొస్తుంది అని బయ్యర్స్‌ని అడిగితే వాళ్లేమన్నారో తెలుసా ? 

Last Updated : Apr 14, 2018, 12:30 AM IST
పవన్ కల్యాణ్‌‌పై తన అభిమానాన్ని ఇలా చాటుకున్న జగ్గూ భాయ్ !

రంగస్థలం సినిమా, అందులో చిట్టి బాబు పాత్ర పోషించిన రామ్ చరణ్, రంగస్థలం సినిమా విజయోత్సవం వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆ సినిమాలో పెసిడెంట్ పాత్ర చేసిన జగ్గూ భాయ్ రంగస్థలం సినిమా విజయోత్సవం వేడుక వేదికపై నుంచి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎంతొస్తుంది అని బయ్యర్స్‌ని అడగ్గా.. " ఎంతొస్తుందో తెలీదు. కలెక్షన్స్ వరదలాగా పారుతోంది. ఎంతొస్తుందో తెలియదు... ఎక్కడ ఆగుతుందో తెలియదు" అని చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అంత పవర్‌ఫుల్ సినిమాకు ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఇక్కడికి రావడంతో ఈ సినిమాకు మరింత పవర్ వచ్చింది అని అన్నారు జగపతి బాబు. మీకు, నాకు బాగా నచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్ ఇక్కడికి రావడంతో ఈ వేడుకకు మరింత పవర్ వచ్చింది అని చెప్పి పవన్‌పై తనకు వున్న అభిమానాన్ని చాటుకున్నారు. రంగస్థలం సినిమా గురించి చెబుతూ.. దాదాపు 15 మంది ఆర్టిస్టులు ఎక్స్టార్డినరిగా పర్‌ఫామ్ చేశారు. అంత మంది ఆర్టిస్టులు అంత గొప్పగా పర్‌ఫామ్ చేశారంటే, ఆ క్రెడిట్ సుకుమార్‌కే వెళ్తుంది. అందుకు సుకుమార్౨కి థాంక్స్ చెప్పుకుంటున్నాను అని అన్నారు జగపతి బాబు.

అన్నింటికిమించి ఈ సినిమా చేసిన తర్వాతే తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న బాలీవుడ్ ఆఫర్ సైతం నన్ను వరించింది అని ఇదే వేదికపై తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చారు జగపతి బాబు. రంగ సినిమాలో నటించిన తర్వాతే.. బాలీవుడ్‌లో ఓ పెద్ద హీరో సినిమాలో ఆఫర్ వచ్చిన విషయాన్ని ఇదే వేదికపై నుంచి అభిమానులతో పంచుకున్నారు. తన 30 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఈ పెసిడెంట్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. చిట్టి బాబు పాత్రను చిట్టిబాబు చిట్టి చిట్టిగా చేశాడు. చించిపారేశాడు అంటూ చరణ్ పర్‌పార్మెన్స్‌ని ఆకాశానికెత్తేశాడు జగ్గూభాయ్. ఈ సినిమా ఇంత సక్సెస్ అందుకుందంటే, అది మీ అందరి దయ వల్లే. అందుకు ఆడియెన్స్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను అని జగపతి బాబు ఇచ్చిన స్పీచ్ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది.

 

Trending News