Viral Video: భార్యను ముద్దాడేందుకు ప్రయత్నించిన ట్రంప్.. ఇంతలో బిగ్ ట్విస్ట్.. వైరల్‌గా మారిన వీడియో..

Donald Trump Video: డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేథ్యంలో ఆయన తన సతీమణిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 21, 2025, 03:57 PM IST
  • వేడుకగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారొత్సం..
  • భార్యకు ముద్దు పెట్టలేకపోయిన ట్రంప్..
Viral Video: భార్యను ముద్దాడేందుకు ప్రయత్నించిన ట్రంప్.. ఇంతలో బిగ్ ట్విస్ట్.. వైరల్‌గా మారిన వీడియో..

Donald trump oath ceremony kiss video: అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టారు. ఈ వేడుక క్యాపిటల్ భవనంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియాలను సంప్రదాయం ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్  ఆయన సతీమణి వీరిని కెపిటల్ భవనంలోకి స్వాగతం పలికారు.

అంత కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు సైతం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉష చిలుకూరీ సైతం వేడుకలో పాల్గొన్నారు. ట్రంప్ ఈ వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖలు, అనేక దేశాల నుంచి అతిథులు హజరయ్యారు. ఈ క్రమంలో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

 

ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ తన భార్యను ముద్దాడేందుకు ప్రయత్నించారు. అప్పుడు.. ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ సతీమణి మెలానియా ఒక టోపీ వేసుకుని ఉన్నారు. ట్రంప్ ముద్దాడేందుకు ప్రయత్నించగా..ఆమె కూడా దానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యారు. కానీ ఇంతలో మెలానియా వేసుకున్న టోపీ ట్రంప్ .. మూతికి అడ్డంగా వచ్చింది. దీంతో ఆయన తన సతీమణిని ముద్దుపెట్టుకొవడం కుదరలేదు. దీంతో ట్రంప్  ముద్దును విరమించుకున్నారు.

భార్య భర్తల ముద్దులాట మధ్య ఆ టోపీ అడ్డుగా నిలిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.  మరోవైపు ట్రంప్ ఇప్పటికే అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్వో నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

Read more:  Donald Trump: తొలి ప్రసంగంతోనే ప్రత్యర్థులకు ఇచ్చి పడేసిన డొనల్డ్‌ ట్రంప్‌.. విశేషాలు ఇవే!

అంతే కాకుండా.. యూఎస్ కు వలస వచ్చిన వారికి.. పుట్టిన పిల్లలకు జన్మత అమెరికా పౌరసత్వం ఇక మీదట ఉండదని స్పష్టం చేశారు.  యుద్దాలు జరక్కుండా చూస్తామని.. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తానని ట్రంప్  47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక విషయాలపై మాట్లాడారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News