Prabhas Hospitality on Set ప్రభాస్ సెట్‌లో ఉంటే.. అందరికీ ఆరోజు కడుపు నిండిపోవాల్సిందే. బాహుబలి సినిమాలో నటించడమే కాదు.. ఆ మంచి మనసు ప్రభాస్‌లో ఉంది. పేరుకే రాజు కాకుండా.. నిజంగానే రాజు అని అనిపించుకుంటాడు ప్రభాస్. అందరి కడుపు నింపాలని ఎప్పుడూ పరితపిస్తుంటాడు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు పెద్దకర్మకు వచ్చిన అభిమానుల అందరి కడుపునింపాడు. కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. అప్పట్లో ఈ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
అయితే ప్రభాస్ తాను చేసే సినిమా సెట్‌లో అందరికీ భోజనాలు వడ్డిస్తుంటాడు. సెట్‌లో ఎంత మంది ఉంటే అంత మందికి ఫుడ్ తీసుకెళ్తాడు. ఇంటి నుంచి స్పెషల్‌గా ఫుడ్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇది వరకే కృతి సనన్, దీపిక పదుకొణె, అమితాబ్, శ్రుతి హాసన్ ఇలా ఎంతో మంది చెప్పుకొచ్చారు. దిషా పటానీ అయితే ఆ ఆతిథ్యం చూసి దెబ్బకు షాక్ అయింది.
తాజాగా రంగస్థలం మహేష్ కొన్ని కామెంట్లు చేశాడు. ప్రభాస్ ఆతిథ్యం గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం సినిమాలోని మెయిన్ టీంకు మాత్రమే కాకుండా సెట్‌లో ఎంత మంది ఉంటే అంత మందికి స్పెషల్ ఫుడ్‌ను తెప్పిస్తాడని మహేష్ చెప్పుకొచ్చాడు. షూటింగ్‌లో 200 మంది ఉంటే 200... 300 ఉంటే 300 మందికి ప్రభాస్ తరపు నుంచి ఫుడ్ వస్తుందని అన్నాడు. తనకు ఏ ఐటం నచ్చిందో అని అడిగాడట.. మటన్ అని చెప్తే.. నెక్ట్స్ డే తనకు మళ్లీ మటన్ పెట్టించాడంటూ ప్రభాస్ గొప్పదనం గురించి మహేష్ చెప్పుకొచ్చాడు.
Also Read: Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి
చాలా రోజుల తర్వాత చెక్ షర్ట్స్ వేస్కొని మంచి కామెడీ పాత్రను చేస్తున్నాడంటూ ప్రభాస్ కారెక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. అంటే మారుతి సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేస్తున్నాడనిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ మారుతి సినిమా మీద మెల్లిగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది ఇంకా తెలియడం లేదు.
Also Read: Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook