Birth Right Citizenship: డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ, జన్మత పౌరసత్వం రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు

Birth Right Citizenship: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అప్పుడే ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు గళమెత్తాయి. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2025, 12:33 PM IST
Birth Right Citizenship: డోనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ, జన్మత పౌరసత్వం రద్దుకు వ్యతిరేకంగా రాష్ట్రాలు

Birth Right Citizenship: తల్లిదండ్రుల స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వాన్ని కల్పించే దశాబ్దాలనాటి చట్టాన్ని ఒకే ఒక్క నిర్ణయంతో రద్దు చేయడంపై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వివిధ రాష్ట్ేరాల అటార్నీ జనరల్స్ దావా వేశారు. డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సుదీర్ఘమైన చట్టపరమైన పోరాటానికి తెరలేపినట్టయింది. 

బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది అమెరికాలో దశాబ్దాలుగా స్థిరపడిన చట్టం. 1868లో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్టం తొలగించాలంటే 14వ సవరణ తొలగించాల్సి ఉంటుంది. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. అందుకే డోనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. జన్మత పౌరసత్వం ప్రకారం ఇప్పటి వరకూ అమెరికా గడ్డపై ఎవరు జన్మంచినా పౌరసత్వం లభించేది. ఆఖరికి పర్యాటక వీసాపై వచ్చి పిల్లలకు జన్మనచ్చినా సరే సిటిజన్‌షిప్ వచ్చేది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ఈ చట్టానికి రక్షణగా ఉంది.అయితే డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని రద్దు చేశారు. 

ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం..

డోనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం అమెరికా పౌరులు కానివారికి లేదా శాశ్వత నివాసితులు కానివారికి జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం కుదరదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికా పౌరులై ఉండాలి లేదా గ్రీన్ కార్డు పొంది ఉండాలి. అప్పుడే పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. ఈ కొత్త ఉత్తర్వులు ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి 20 నుంచి అమెరికాలో పుట్టిన విదేశీ తల్లిదండ్రుల పిల్లలకు పౌరసత్వం లభించదు.

డోనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులపై వ్యతిరేకత

ఈ ఉత్తర్వులపై అమెరికా వ్యతిరేకత వ్యక్తమౌతోది. ట్రంప్ ఆదేశాల్ని అడ్డుకునేందుకు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, శాన్‌ఫ్రాన్సిస్కో సహా 18 రాష్ట్రాలు యూఎస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా అధ్యక్షుడికి వివిధ అంశాల్లో విస్తృత అధికారాలున్నప్పటికీ వారు రాజులు మాత్రం కారని, ఓ సంతకంతో దశాబ్దాల నాటి చట్టాన్ని తొలగించలేరని న్యూజెర్సీ డెమోక్రటిక్ అటార్నీ జనరల్ మాట్ పాట్కిన్ తెలిపారు. ట్రంప్ ఉత్తర్వులను అడ్డుకుంటున్న బృందంలో న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మసాచుసెట్స్, కొలరాడో, కనెక్టికేట్, డెలావర్, హవాయి, మైనే, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూ మెక్సికో, న్యూయార్క్, నార్త్ కరోలినా, రోడ్ ఐలాండ్, వెర్మోంట్, విస్కాన్సిన్ రాష్ట్రాలు ఉన్నాయి. 

Also read: JEE Mains Exams 2025: నేటి నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News