చిట్టి బాబులో నాకు బాగా నచ్చింది అదే : పవన్ కల్యాణ్

చిట్టి బాబు గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 

Last Updated : Apr 14, 2018, 04:58 PM IST
చిట్టి బాబులో నాకు బాగా నచ్చింది అదే : పవన్ కల్యాణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ రంగస్థలం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మరింత ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా ఆ చిత్ర యూనిట్ తాజాగా ఓ సక్సెస్ మీట్ నిర్వహించింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తలదన్నే స్థాయిలో నిర్వహించిన ఈ సక్సెస్ మీట్‌కి చెర్రీ బాబాయి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగస్థలం సినిమాలో చిట్టి బాబుగా ప్రధాన పాత్ర పోషించిన రామ్ చరణ్ గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. " రామ్ చరణ్ తనకు తమ్ముడు లాంటి వాడు అని అన్నారు. రామ్ చరణ్ సంపూర్ణమైన నటుడు. పరిశ్రమలోనే కాకుండా బయట కూడా మంచి పేరు సంపాదించుకునే సత్తా చరణ్ సొంతం. విజయాలకు పొంగిపోడు.. అపజయాలకు కుంగిపోడు. అందుకే చరణ్ బాగా నాకు నచ్చుతాడు" అని చెర్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు పవన్. 

కేవలం కలెక్షన్స్ పరంగానే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే గర్వించదగిన సినిమాను తెరకెక్కించిన సుకుమార్‌కి మనస్పూర్తిగా తన అభినందనలు తెలియచేసుకుంటున్నాను. అటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు. అప్పుడెప్పుడో తొలిప్రేమ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఒక సినిమాను పబ్లిక్ మధ్య థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేయాలనిపించింది. హాలీవుడ్ సినిమాలకు రాని అద్భుతమైన రేటింగ్ ఈ సినిమాకు ఇవ్వడం చూస్తే, ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించింది. ఇటీవలె కొద్ది రోజుల క్రితం నాకూ ఆ అవకాశం కలిగింది అంటూ రంగస్థలం సినిమా చూసినప్పటి క్షణాలను పవన్ ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. 

 

రంగస్థలం సినిమా గురించి మంరింత మాట్లాడుతూ.. రంగస్థలం చూశాకా తనకు ఓ సినిమాను చూసిననట్టుగా కాకుండా నిజంగానే ఏదో జీవితాన్ని చూసినట్టు అనిపించింది. అంత సహజంగా వుంది ఆ సినిమా అని రంగస్థలం సినిమాపై పవన్ ప్రశంసల జల్లు కురిపించారు. రామ్ చరణ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి. మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ ఆకాక్షించారు. 

Trending News