Donald Trump Oath As Presindent Of America: గడ్డకట్టే చలిలో...మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ లో శ్వేత సౌధంలో 78 యేళ్ల డొనాల్డ్ ట్రంప్ అమెరికా47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెమొక్రాటిక్ పార్టీ 82ఏళ్ల జో బైడెన్ నుంచి ట్రంప్ ప్రెసిడెంట్ పగ్గాలను అందుకున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిట్ భవనంలో ఆ దేశ అత్యున్నత న్యాయమూర్తి జస్టిన్ జాన్ రాబర్డ్స్ ట్రంప్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ తన ఫ్యామిలీకి చెందిన బైబిల్ తో పాటు 1861లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న అబ్రహాం లింకన్ ప్రమాణం చేసిన బైబిల్ ను చేత పట్టుకొని అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అంతేకాదు అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రపంచ దేశాలు కుళ్లుకునేలా అమెరికాను అన్ని రంగాల్లో అగ్ర పథాన నిలపడమే తన లక్ష్యమని భీషణ ప్రతిజ్ఞ చేశారు.
అగ్ర రాజ్యంగా అమెరికా పేరు ప్రతిష్ఠలు నిలబెట్టేలా తన పాలన ఉంటుందన్నారు. ముఖ్యంగా అక్రమ వలసను అరికడతామన్నాడు. దేశ దక్షిణాన ఉన్న బార్డర్స్ లో ఎమర్జన్సీ విధిస్తానని ప్రకటించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వైట్ హౌస్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ దంపతులకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్ దంపతులు స్వాగతం పలికారు.
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన ట్రంప్ స్పీచ్ సమయంలో ఇతర ప్రముఖులు తమ స్థానాల్లో నిల్చొని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ప్రమాణ స్వీకారోత్సవానికి యూఎస్ మాజీ ప్రెసిడెంట్స్ బరాక్ ఒబామా, బుష్, బిల్ క్లింటన్ లు తదితరులు హాజరయ్యారు. ఇక ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక ప్రెసిడెంట్ గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో బయట శతఘ్నులను పేల్చి గౌరవ వందనం సమర్పించారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారం తన పాలన ఉంటుందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో నేరగాళ్లకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తీవ్రవాదులను సహించే ప్రసక్తే లేదన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడతానన్నారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తానన్నారు. అమెరికా పౌరులని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానన్నారు. ముఖ్యంగా అక్రమ వలసకు అడ్డుకట్టతో పాటు మెక్సికో, కెనడాల చుట్టు గోడ నిర్మిస్తానని ట్రంప్ తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మన దేశం తరుపు విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ హాజరయ్యారు. అటు మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులతో పాటు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, టెక్ టాక్ అధినేత షోజీ చ్యూ, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా ప ప్రపంచ దిగ్గజ కంపెనీల అధినేతలు హాజరై ట్రంప్ కు అభినందనలు తెలియజేసారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.