Miss India Runner Up: మోడలింగ్ రంగం అంటే ఆషామాషీ కాదు. అయితే ఇందులో ప్రవేశించే యువతులు చాలా మంది పెళ్లి తర్వాత ఆ కెరీర్‌ను కంటిన్యూ చేయడం అంతా ఆషామాషీ కాదు. కానీ కొంత మంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా మోడలింగ్‌లో రాణిస్తుంటారు. అలాంటి వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన శ్రుతి చక్రవర్తి ఒకరు. తాజాగా ఈమె మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచి సంచలనం రేపింది.
BJP Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో పోలీసు అధికారిణి చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే మాధవీలన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమాదేవీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈఘటకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
Vivaha Prapti Program Cancelled In Chilkur Balaji Temple: పెళ్లి కాని వారికి చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు భారీ షాక్ ఇచ్చారు. ఉత్సవాల్లో కీలకమైన 'వివాహ ప్రాప్తి' కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Electricity Demand In Hyderabad: ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గురువారం మధ్యాహ్నం వరకు 4053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధికమించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం విద్యుత్ సరఫరా చేశారు.
Hoboken City Police Arrested Two Telugu Students In US: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువతులు పరువు మొత్తం తీశారు. అక్కడ దొంగతనానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
HCU Clash: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. బుధవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
KCR Review Meeting On Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం సమీక్ష సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించే దిశగా కేసీఆర్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు రూ.95 లక్షలు ఎన్నికల నిధి అందించనున్నారు.
KCR House Kshudra Pooja: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివసిస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రబట్ట, నిమ్మకాయలు, బొమ్మ ఉండడం స్థానికంగా భయాందోళన మొదలైంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
Sri Rama Navami 2024 Wine Shops Close 24 Hours In Twin Cities: మరోసారి మందుబాబులకు నిరాశ. శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Revanth Reddy Class: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అజెండా లేకుండా ఎన్నికల్లో అందరి సమన్వయంతో పని చేయాలని పార్టీ దూతలు సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలిపై మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని నిలువరించి.. అందరినీ కలుపుకోవాలని సూచించారు.
DR BR Ambedkar Jayanthi: దేశ వ్యాప్తంగా రాజ్యంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడలా బాబా సాహేబ్ విగ్రహాలను శుభ్రం చేసి పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు.
Revanth Reddy Govt Will Collapse Says Kishan Reddy: ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుండగా దానికి కిషన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని కేంద్ర మంత్రి జోష్యం చెప్పారు.
You Know KCR KT Rama Rao Ugadi Panchangam: తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం కేసీఆర్‌కు అనుకూలంగా ఉంది. మళ్లీ విజయ అవకాశాలు గులాబీ బాస్‌కు ఉన్నాయని పంచాంగ కర్తలు తెలపడంతో గులాబీ పార్టీ శ్రేణులు సంబరం వ్యక్తం చేస్తున్నాయి.
Ugadi 2024: ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. ఇక రాజకీయ పార్టీల నాయకులు కూడా పండుగలో పాల్గొని తమ భవిష్యత్‌ను తెలుసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు చేసుకున్నారు. ఏపీలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఉగాది పండుగ చేసుకున్నారు.
Hyderabad Weather Alert: హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు అందించింది. భగభగ మండే భానుడి నుంచి కాస్త బ్రేక్ దొరకనుంది. రానున్న రెండు నుంచి మూడు రోజులపాటు ఉరుములతో కూడిని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Big Shock To Hyderabad Metro Commuters: మెట్రో హైదరాబాద్ ప్రయాణీకులకు బిగ్ షాక్ ఇచ్చింది. రాయితీలకు మంగళం పాడింది. 59 కార్డును రద్దు చేసింది. 10 శాతం రాయితీని కూడా పూర్తిగా రద్దు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.