Govt Collapse: రేవంత్‌ జోలికి మేం వెళ్లం.. కానీ వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు: కిషన్‌ రెడ్డి జోష్యం

Revanth Reddy Govt Will Collapse Says Kishan Reddy: ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వాదిస్తుండగా దానికి కిషన్‌ రెడ్డి కూడా వత్తాసు పలికారు. వాళ్లలో వాళ్లే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని కేంద్ర మంత్రి జోష్యం చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 9, 2024, 08:29 PM IST
Govt Collapse: రేవంత్‌ జోలికి మేం వెళ్లం.. కానీ వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారు: కిషన్‌ రెడ్డి జోష్యం

Kishan Reddy: అధికారంలోకి వచ్చినా కూడా రేవంత్‌ రెడ్డికి ప్రశాంతత లేదు. పార్టీలోని విబేధాలు ఏనాడో ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తాయనే భయం ఉండడంతో రేవంత్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అయినా కూడా కొన్ని నెలల్లో ఈ ప్రభుత్వం కూలుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే వాదనను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటి నుంచో చేస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అదే విషయాన్ని చెప్పారు. రేవంత్‌ రెడ్డి జోలికి తాము వెళ్లమని.. కానీ వారిలో వారే కొట్టుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటారని జోష్యం చెప్పారు.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి దంపతులు ప్రత్యేక యాగం చేశారు. పంచాంగ శ్రవణం అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వం కూలగొట్టే కుట్రలు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కిషన్‌ రెడ్డి స్పందించారు. 'రేవంత్‌ రెడ్డికి బీజేపీతో వచ్చిన అపాయం ఏమీ లేదు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని మేం ఎలాంటి ఇబ్బందులకు గురి చేయం. కానీ కాంగ్రెస్‌ పార్టీ నుంచే రేవంత్‌కు ప్రమాదం పొంచి ఉంది' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గజదొంగల ప్రభుత్వంగా వర్ణించారు. 'తెలంగాణలో దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లు ఉంది ప్రభుత్వ పాలన' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Tamanna Simhadri: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తమన్నా

 

'కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించినందుకు ప్రజల నుంచి రాహుల్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావు' అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతున్న నావగా పేర్కొన్నారు. ఇక తమ పార్టీ అత్యధిక సీట్లు గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News