Zee Telugu News Celebrates Ganesh Chaturthi: నిజం నిక్కచ్చిగా అంటూ తెలుగు ప్రజల ఆదరాభిమానం పొందుతున్న జీ తెలుగు న్యూస్ కార్యాలయంలో వినాయక చవితి భక్తిశ్రద్ధలతో జరిగింది. చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
Himayatsagar And Osmansagar Gates Lifted: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్సాగర్లు నిండుకోవడంతో అధికారులు వాటి గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది.
Actor Vinayakan Arrested By Hyderabad Police At Shamshabad Airport: జైలర్ సినిమాలో నటించిన నటుడు వినాయకన్ మరోసారి జైలు పాలయ్యాడు. ఓ కానిస్టేబుల్ దాడి చేశారనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Balapur Laddu Auction Rules: వేలంతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బాలాపూర్ లడ్డూలో కీలక మార్పులు జరిగాయి. వేలంలో పాల్గొనేవారికి నిర్వాహకులు కీలకమైన సూచనలు చేశారు.
Gates Of Himayatsagar And Osmansagar Lifted: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్సాగర్లు నిండుకున్నాయి. ప్రవాహం పెరుగుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది.
CM Revanth reddy: తెలంగాణ సర్కారు మరోసారి ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ గా.. డైనమిక్ అధికారి సీవీ ఆనంద్ కు మరోసారి అవకాశం ఇచ్చింది.
Telangana CMRF Receives Big Donations For Flood Relief: భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడిన తెలంగాణకు స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, పలు రంగాల ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు దాతలు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Mahesh Kumar Appoints TPCC President: అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యాడు. అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మహేశ్ వైపే మొగ్గు చూపడంతో బీసీ నాయకుడికి టీపీసీసీ పదవి దక్కింది.
Whiskey Ice Cream: మద్యంతో ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న ఐస్‌క్రీమ్ స్టోర్‌పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేసి చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం కలిపిన ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
Revanth Reddy Big Shock To Seniors With Mahesh Kumar Become TPCC President: బడా బడా నాయకులు ఉన్నా కూడా జూనియర్ నాయకుడికి టీపీసీసీ స్థానాన్ని రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇప్పించుకుని సీనియర్స్‌కు భారీ షాకిచ్చాడు.
Heavy Rains: గత కొన్నేళ్లుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల ఏర్పడ్డ వరద కారణంగా అన్ని చోట్ల బురద మయం అయింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలియజేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల మరొసారి ఉలిక్కపడ్డారు. కానీ అనూహ్యంగా వాయు గుండం తెలుగు రాష్ట్రాలకు ఆవలి వైపు తీరం దాటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది.
Ex Minister Harish Rao Flood Relief: వరద సహాయంలో రేవంత్ ప్రభుత్వం విఫలం కాగా.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహాయం చేశారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరద బాధితులకు అవసరమైన సామగ్రిని నాలుగు లారీల్లో పంపించారు.
Electric Shock While Ganesh Idol Arriving: వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాలు తీసుకొస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో చోటుచేసుకుంది.
KCR Active Politics: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. రేవంత్ రెడ్డి అన్నింటా విఫలమవడంతో రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ నేరుగా ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారని సమాచారం. దీంతో గులాబీ పార్టీలో జోష్ రానుంది.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద బీభత్సానికి చలించిన పోయిన ప్రభాస్ ఉభయ రాష్ట్రాలకు తన వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ముందుంటారు. ఈ కోవలో గత కొన్ని రోజులుగా వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొచ్చారు. తాజాగా తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతు భారీ విరాళం అందజేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.