Miss India Runner Up: మిసెస్ ఇండియా రన్నరప్‌గా హైదరాబాద్ యువతి శ్రుతి చక్రవర్తి సంచలనం..

Miss India Runner Up: మోడలింగ్ రంగం అంటే ఆషామాషీ కాదు. అయితే ఇందులో ప్రవేశించే యువతులు చాలా మంది పెళ్లి తర్వాత ఆ కెరీర్‌ను కంటిన్యూ చేయడం అంతా ఆషామాషీ కాదు. కానీ కొంత మంది మాత్రమే పెళ్లి తర్వాత కూడా మోడలింగ్‌లో రాణిస్తుంటారు. అలాంటి వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన శ్రుతి చక్రవర్తి ఒకరు. తాజాగా ఈమె మిసెస్ ఇండియా రన్నరప్‌గా నిలిచి సంచలనం రేపింది.

Last Updated : Apr 23, 2024, 12:18 PM IST
 Miss India Runner Up: మిసెస్ ఇండియా రన్నరప్‌గా  హైదరాబాద్ యువతి శ్రుతి చక్రవర్తి సంచలనం..

Miss India Runner Up: శ్రుతి చక్రవర్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్థాయి నుంచి మిసెస్ ఇండియా రన్నరప్‌గా 2024 టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టైటిల్ గెలవడం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ముఖ్యంగా ఈ పోటీలో తన అందచందాలతో అందరినీ అలరించింది. భరత్ 24 సమర్పించిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్, గ్లామనాంద్ గ్రూపు
జైపూర్‌లో ఏప్రిల్ 16న  నిర్వహించారు. ఈ పోటీలో 20 మంది ప్రతిభావంతులైన కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. ఇందులో శ్రుతి చక్రవర్తి రన్నరప్ స్థాయిలో నిలిచింది. శృతి తనలోని హ్యూమానిటి, ప్రశాంతత, గ్లామర్‌తో అక్కడ వాళ్ల హృదయాలను గెలుచుకుంది. రన్నరప్‌గా నిలవడానికి ఈమె చేసిన ప్రయాణం, శిక్షణ మరియు వస్త్రధారణ వెనక ఎన్నో ఏళ్లు శ్రమ దాగి ఉంది. దానికి ఇపుడు తగిన గుర్తింపు లభించినట్లైయింది. ఈ టైటిల్ వెనక శ్రుతి డెడికెషన్‌కు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్, అందాల  పోటీ రంగంలో ఒక గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఈ పోటీలో పాల్గొంది. ఈ పోటీలో ఆమె అందంతో పాటు తన గ్రేస్‌తో అక్కడివారినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈమె గెలుపు మహిళా సాధికారికతకు నిదర్శనంగా నిలిచింది. ఈ పోటీలో  రన్నరప్‌గా నిలిచి.. ఇలాంటి తరహా పోటీలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్లకు ఆదర్శంగా నిలిచింది.  రన్నరప్‌గా నిలిచిన శ్రుతికి సోషల్ మీడియా వేదికగా స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News