Ugadi Panchangam: తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో చేసుకుని ఆనందంగా గడిపారు. ఇక రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు జరిపాయి. ఈ సందర్భంగా తమ పార్టీ అధినేతలు, పార్టీ భవిష్యత్‌పై ఆసక్తిగా పంచాంగ శ్రవణం విన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంచాంగం ఆసక్తికరంగా ఉంది. గులాబీ దళపతికి మళ్లీ విజయ అవకాశాలు ఉన్నాయని పండితులు తెలిపారు. కేసీఆర్ పంచాంగం విన్న గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Ugadi Festival Quotes in Telugu: ఉగాది ఏ రోజున జరుపుకోవాలి? ఏ టైమ్‌లో ఏం ఏం చేయాలి?
ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పండితులు పంచాంగం పఠించారు. ఈ సందర్భంగా ఏడాదంతా ఎలా ఉంటుందో వివరించారు. ఈ క్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచాంగం కూడా చెప్పారు. వారిద్దరి పంచాంగం ఆసక్తిగా ఉంది.
Also Read: Ex CM KCR Horoscope: క్రోధీ నామ సంవత్సరంలో కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది.. మరోసారి చక్రం తిప్పేనా.. ?
కేసీఆర్ పంచాంగం
క్రోధి నామ సంవత్సరంలో కేసీఆర్‌కు కాలం కలిసి రానుంది. కేసీఆర్ రాశి కర్కాటకం. ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. ఈ రాశివారికి సంవత్సరమంతా మంచిగా ఉంటుంది. వీరు చేసే వ్యవహారాల్లో అద్భుత విజయాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివల్లే వేసే ఎత్తుగడులు ఫలిస్తాయి. వీరు తీసుకునే నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుంది. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ట కలుగుతుంది. వీరికి ఈ ఏడాది ఎలాంటి అడ్డు ఉండదని పండితులు చెప్పారు. అయితే కర్కాటక రాశి వారికి కొంత ఆటంకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాహన ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రయాణాలు తరచూ చేయవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే దోష నివారణకు లక్ష్మీ, మోహన గణపతిని పూజించాలని పండితులు వివరించారు.
కేటీఆర్ పంచాంగం
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పంచాంగం కూడా పండితులు చెప్పారు. కేటీఆర్ రాశి మకర. ఈ రాశి కలిగిన వారికి కొత్త సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉంది. ఇక రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాల్సి ఉంది. మాటను నియంత్రించుకోవాలి. ఆచితూచి మాట్లాడితే ఉపకారం పొందుతారు. వ్యాపార రంగంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది. ప్రజలు, పార్టీలో అందరి అభిమానం పొందుతారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. దోష నివారణకు మకర రాశివారు జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని పండితులు సూచించారు. దీంతోపాటు రుద్రయాగం చేయాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook