ఓటు హక్కుపై "తలజుట్టు"తో ప్రచారం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన తలజుట్టునే ఈవీఎం రూపంలో మార్చి ప్రచారాన్ని ప్రారంభించింది. 

Last Updated : Dec 7, 2017, 08:59 PM IST
ఓటు హక్కుపై "తలజుట్టు"తో ప్రచారం

ఓటు వేయడం అనేది పౌరుడిగా నీ హక్కు.. మంచి నాయకులను ఎంచుకోవాలంటే ముందు ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ఓటు హక్కును వినియోగించుకోలేకపోతే నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోయినట్లే.. ఇలాంటి స్లోగన్స్‌తో ఓటుహక్కు గురించి ప్రజల్లో అవగాహన కల్పించేవారిని మనం చూసుంటాం. సాధారణంగా ఇలాంటి ప్రచారాలు చేయాలంటే పేపర్ బోర్డులు లేదా బ్యానర్లు వాడతారు.

కొందరు వాహనాలు లేదా బిల్ బోర్డులను కూడా ప్రచారానికి వినియోగిస్తారు. కానీ.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ తన తలజుట్టునే ఈవీఎం రూపంలో మార్చి ప్రచారాన్ని ప్రారంభించింది. తన జుట్టుపై ఈవీఎం ఆకారంలో పెయింటింగ్ వేయించుకొని.. ఓటు హక్కు విశిష్టతను ప్రజలకు తెలియజేయాలని సంకల్పించింది.

శనివారం గుజరాత్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆమె ఈ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. "ఓట్ ఫర్ గుజరాత్" పేరుతో తన తలజుట్టుతో ఆమె చేస్తున్న వినూత్న ప్రచారానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. 

Trending News