బీజేపీ 'అసలైనది'.. 'నకిలీ' కి ప్రాధాన్యత ఇస్తారా?: అరుణ్ జైట్లీ ఎద్దేవా

ప్రజలు అసలైనది అందుబాటులో ఉంచుకొని.. నకిలీకి (కాంగ్రెస్) ఎందుకు ప్రాధాన్యమిస్తారు?" అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు.

Last Updated : Dec 3, 2017, 03:49 PM IST
బీజేపీ 'అసలైనది'.. 'నకిలీ' కి ప్రాధాన్యత ఇస్తారా?: అరుణ్ జైట్లీ ఎద్దేవా

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగాస్త్రాలు సంధించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ సూరత్ కు వచ్చారు. రాహుల్ గాంధీ గుజరాత్ లో దేవాలయాలను సందర్శిస్తుండటంపై పెదవి విరిచారు. ప్రజలు బీజేపీని ఎప్పుడూ హిందూ అనుకూల పార్టీగానే చూస్తారనున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకే ప్రాధాన్యమిస్తారు. ప్రజలు అసలైనది అందుబాటులో ఉంచుకొని.. నకిలీకి (కాంగ్రెస్) ఎందుకు ప్రాధాన్యమిస్తారు?" అంటూ ఎద్దేవా చేశారు. 

గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాము. బీజేపీకి గుజరాత్ చాలా కీలక రాష్ట్రమని అభివర్ణించారు. 80వ దశకంలో సాంఘీక ఏకీకరణకు బీజేపీ చరమగీతం పాడిందని గుర్తుచేశారు. గుజరాత్ రాష్ట్రంలో తమను ఢీ కొట్టే సత్తా ఎవరికీ లేదని.. వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలుపొంది రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తామని  జైట్లీ పునరుద్ఘాటించారు.

Trending News