గుజరాత్‌‌ పోరు; రెండో దశ పోలింగ్ విశేషాలు..

గుజరాల్ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

Last Updated : Dec 14, 2017, 05:07 PM IST
గుజరాత్‌‌ పోరు; రెండో దశ పోలింగ్ విశేషాలు..

గుజరాత్‌లో రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. కాగా రెండో దశలో మొత్తం 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను మొత్తం 851 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ రోజు ఓటింగ్ జరగనున్న ప్రాంతాల్లో మొత్తం 2.22 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

* బనస్కంత, పఠాన్, సబర్కాంత, మెహసన, గాంధీనగర్, అహ్మెదాబాద్, ఆరావళి, మహిసాగర్, పంచమహల్, దహోద్, ఖెడా, ఆనంద్, వదోదర, చోటా ఉదేపూర్ జిల్లాల్లోని 14,523 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 25,575 పోలింగ్ బూత్‌లలో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 

* సంఖేడాలోని సొధాలియాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం) మొరాయించడంతో 50 నిమిషాలపాటు ఓటింగ్ నిలిచిపోయిందని.. ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సవరించిన తర్వాత మళ్లీ యథాతథంగా ఓటింగ్ ప్రారంభమైనట్టుగా పోలింగ్ ఆఫీసర్ గౌరంగ్ రానా తెలిపారు. 

Trending News