తొలి విడత గుజరాత్ ఎన్నికల పోలింగ్ విశేషాలు..!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసింది. సౌరాష్ట్రతో పాటు దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగడం విశేషం.

Last Updated : Dec 10, 2017, 03:43 PM IST
తొలి విడత గుజరాత్ ఎన్నికల పోలింగ్ విశేషాలు..!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ విజయవంతంగా ముగిసింది. సౌరాష్ట్రతో పాటు దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగడం విశేషం. పలుచోట్ల ఈవీఎం మెషీన్లు మొరాయించినప్పటకీ.. అన్ని చోట్లా పోలింగ్ విజయవంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదేవిధంగా, ఈ నెల 18న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. తొలివిడత పోలింగ్  సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు 47.28 శాతం నమోదయినట్లుగా అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఈ పోలింగ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు

  • సురేంద్ర నగర్ జిల్లాలోని లిమిడి గ్రామ ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు.
  • సూరత్ లాంటి పటిదార్ ప్రభావిత ప్రాంతాల్లో, పటిదార్ ఆందోళనల్లో మరణించిన వారి ఫోటోలను పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రదర్శించడం గమనార్హం
  • సత్తాపూర్ ప్రాంతంలో ఈవీఎం మెషీన్లు పూర్తిగా మొరాయించి, అధికారులకు ముచ్చెమటలు పట్టించాయి
  • భావనగర్ ప్రాంతంలో ఎన్నికల అధికారులు, ఓటర్ల కోసం సెల్ఫీ పాయింట్లను పెట్టారు. ఓటు వేశాక ఓటర్లు అక్కడ సెల్ఫీలు దిగడం గమనార్హం
  • కాంగ్రెస్ నేత అర్జున్ మోద్వాలియా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మెషీన్లను బ్లూటూత్ ద్వారా బయటకు వ్యక్తులకు కనెక్ట్ చేశారని ఆరోపించారు.
  • ఫెన్నీ పారేఖ్ అనే నవ వధువు, తన పెళ్లి కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని మరీ పోలింగ్ బూత్‌కు ఓటువేయడానికి వచ్చారు. 
  • బీజేపీ నేత రేష్మా పటేల్ తన ఓటు వేయడానికి వచ్చినప్పుడు, పటేదార్ ఆందోళనకారులు ఆమెను చుట్టుముట్టి కొద్దిసేపు ఇబ్బంది పెట్టారు. 
  • అంకలేశ్వర్ ప్రాంతంలో ఓటు వేసిన కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్, కాంగ్రెస్ 110 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుందని తేల్చిచెప్పారు
  • భారుచ్ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న నవదంపతులు వేదిక నుండి డైరెక్ట్‌గా పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
  • గాంధీజీ ప్రారంభించిన దండి సత్యాగ్రహంలో పాల్గొన్న మోత్లీ బా అనే 106 సంవత్సరాల సీనియర్ సిటిజన్, సూరత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

Trending News