గుజరాత్‌లో రీపోలింగ్ షురూ

గుజరాత్‌లోని ఆరు పోలింగ్ సెంటర్లలో రీపోలింగ్ మొదలైంది.

Last Updated : Dec 17, 2017, 01:54 PM IST
గుజరాత్‌లో రీపోలింగ్ షురూ

గుజరాత్‌లోని ఆరు పోలింగ్ సెంటర్లలో రీపోలింగ్ మొదలైంది. వాద్గామ్, వీరంగామ్, దస్కొరాయ్, సావ్లి ఏరియాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు దీరారు.  గుజరాత్‌లోని ఆరు పోలింగ్ సెంటర్లలో ఆదివారం రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మాక్ పోల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంల నుంచి మాక్‌పోల్ ఓట్లను తొలగించకపోవడంతో ఆయా చోట్ల రీపోలింగ్‌కు ఈసీ నిర్ణయించింది. కాగా రేపు (సోమవారం) ఓట్ల లెక్కింపుతో పాటు ..అదే రోజు ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

 

 

Trending News